నాగార్జున ఫాంహౌస్‌‌లో డెడ్ బాడీ ఎవరిదో తెలిసింది

కేశంపేట, వెలుగు: హీరో అక్కినేని నాగార్జున ఫామ్ హౌస్ లో చనిపోయిన వ్యక్తి పాపిరెడ్డి గూడకు చెందిన చాకలి పాండుగా అనుమానిస్తున్నారు. రంగారెడ్డి జిల్లా కేశంపేట మండలం పాపిరెడ్డిగూడలోని నాగార్జున ఫామ్ హౌస్ లో బుధవారం బయటపడిన డెడ్ బాడీని శంషాబాద్ డీసీపీ ప్రకాశ్‌‌ రెడ్డి గురువారం పరిశీలించారు.

డెడ్ బాడీ కుళ్లిపోయి గుర్తు పట్టని స్థితిలో ఉండడంతో  ఫోరెన్సిక్ నిపుణులను రప్పించి అక్కడే పోస్టుమార్టం నిర్వహించారు. శవం బయటపడిన ప్రదేశంలోనే పాండు పేరుపై ఉన్న ఐడీ కార్డు దొరికింది. అయితే ఇప్పుడే తాము ఏమీ చెప్పలేమని, పోస్టుమార్టంతో పాటు పూర్తి విచారణ తర్వాత వివరాలు వెల్లడిస్తామని సీఐ రామకృష్ణ తెలిపారు. వీఆర్‌‌వో మమత ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నామన్నారు. దాదాపు నాలుగు ఏండ్ల కిందట పాపిరెడ్డిగూడకు చెందిన చాకలి పాండు(32) కనిపించకుండా పోయాడని, ఈ డెడ్ బాడీ అతడిదే కావచ్చని గ్రామస్తులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

Latest Updates