మూడు రోజులుగా ఇంట్లోనే మృతదేహం.. పీక్కుతిన్న చీమలు

కరెంటు షాక్‌తో మృతి చెందిన మహిళ మృతదేహం మూడు రోజుల పాటు గదిలోనే పడి ఉండడంతో చీమలు పీక్కు తిన్నాయి. ఈ దారుణ ఘటన రంగారెడ్డి జిల్లాలోని శంషాబాద్‌లో చోటుచేసుకుంది. శంషాబాద్‌లోని రాళ్ళగూడ వద్ద రాజీవ్ గృహకల్ప కాలనీలోని ఓ ఇంట్లో ఒక మహిళ మూడు రోజుల క్రితం అనుమానాస్పద స్థితిలో మృతిచెందింది. అయితే ఆమె మరణించి మూడు రోజులు కావడంతో ఆమె మృతదేహాన్ని చీమలు పీక్కు తిన్నాయి. ఆమె ఇంట్లోంచి దుర్వాసన రావడంతో మంగళవారం రాత్రి చుట్టుపక్కల వాళ్లు గమనించి మునిసిపల్ వైస్ చైర్మన్ బండి గోపాల్ యాదవ్‌కు సమాచారం అందించారు. దాంతో ఆయన వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని ఆమెను శంషాబాద్‌లోని ఆసుపత్రికి తరలించారు. కానీ అప్పటికే ఆమె చనిపోయినట్లు డాక్టర్లు తేల్చారు. అయితే మృతురాలికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

For More News..

నేటి నుంచి కోచింగ్ సెంటర్లు, హాస్టళ్లు బంద్

నిజామాబాద్ ఎమ్మెల్సీ బరిలోకి కవిత

కరోనా సోకిన వ్యక్తి బయట తిరిగితే 12 ఏండ్ల జైలు

Latest Updates