ముగిసిన ఎన్నికల నామినేషన్ల గడువు

మున్సిపాలిటీ, కార్పొరేషన్ ఎన్నికల నామినేషన్ల దాఖలు గడువు ఇవాళ్టి(శుక్రవారం)తో ముగిసింది. ఎన్నికలు జరగనున్న 9 కార్పొరేషన్లు, 120 మున్సిపాలిటీల్లో అభ్యర్థులు భారీగా నామినేషన్లు దాఖలు చేశారు. రేపు(శనివారం) నామినేషన్లను పరిశీలిస్తారు. నామినేషన్ల ఉపసంహరణ గడువు ఈ నెల 14. ఈ నెల 22న పోలింగ్‌ నిర్వహించి… 25న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు అధికారులు.

మొదట కరీంనగర్ కార్పొరేషన్ ఎన్నికకు నోటిఫికేషన్ ఇవ్వని రాష్ట్ర ఎన్నికల సంఘం నిన్న(గురువారం) నోటిఫికేషన్ జారీ చేసింది. ఇవాళ(శుక్రవారం) స్థానికంగా రిటర్నింగ్ అధికారులు ఎన్నిక నోటీసు జారీ చేశారు. దీంతో ఇవాళ ఉదయం 10.30 గంటల నుంచి నామినేషన్ పత్రాలు స్వీకరించారు. ఈనెల 12వ తేదీ వరకు నామినేషన్లు స్వీకరించనున్నారు.

Latest Updates