యూపీలోని11 జిల్లాల్లో ‘డెడ్లీ’ మలేరియా

మలేరియా గురించి తెలుసు కానీ.. డెడ్లీ మలేరియా ఏంటనుకుంటున్నారా? మామూలు మలేరియా మందులేసుకుంటే తగ్గుతుంది. కొంచెం లేటైనా ప్రమాదమేం లేదు. కానీ.. సకాలంలో ట్రీట్ మెంట్ జరగకపోతే డెడ్లీ మలేరియా ప్రాణాలను తోడేస్తుంది. అందుకే.. యూపీలోని11 జిల్లాల్లో ఈ వ్యాధి విజృంభిస్తుండటంతో  అధికారులు పరుగులు పెడుతున్నారు. ప్లాస్మోడియం పారాసైట్ వల్ల మలేరియా వస్తుందని మనకు తెలుసు. ఈ పారాసైట్ లో 4 రకాలు ఉంటాయి. వీటిలో ప్లాస్మోడియం వైవాక్స్ చాలా సాధారణం. దీనివల్ల పెద్దగా హాని ఉండదు.

కానీ.. ప్లాస్మోడియం ఫాల్సిఫెరమ్ రకం పారాసైట్ సోకితే.. ప్రాణాలు పోయే ప్రమాదం ఎక్కువ. ప్రస్తుతం యూపీలో 852 ఫాల్సిఫెరమ్ మలేరియా కేసులు నమోదయ్యాయి. ఒక్క బరేలీలోనే 707, బదౌన్లో 106, సోన్ భద్రలో 23, మిగతా  జిల్లాలో ఒక్కో కేసు బయటపడ్డాయి. దీంతో ఒక ఇంట్లో కేసు నమోదైతే.. ఆ ఇంటి చుట్టుపక్కల 50 ఇండ్ల పరిధి వరకూ అధికారులు ఫాగింగ్ చేయడంతో పాటు పైరిత్రిన్ మందునూ స్ప్రే చేస్తున్నారు.