జ‌ర్మ‌నీలో మ‌రో కొత్త వైర‌స్.. భారీ ఎత్తున ఆర్ధిక న‌ష్టం

జ‌ర్మ‌నీ కొత్త వైర‌స్ తో ఉక్కిరి ఉక్కిరి అవుతున్న‌ట్లు తెలుస్తోంది. ప్ర‌పంచ దేశాలు క‌రోనా పై పోరాటం చేస్తుంటే జ‌ర్మనీ మాత్రం క‌రోనాతో పాటు మ‌రో కొత్త వైర‌స్ తో ఆందోళ‌నకు గుర‌వుతుంది.

జర్మనీ బ్రాండెన్‌బర్గ్‌లో ఆఫ్రికన్ స్వైన్ ఫీవర్ వైరస్ వెలుగులోకి వ‌చ్చిన‌ట్లు ఆదేశ వ్యవసాయ మంత్రిత్వ శాఖ తెలిపింది. పోలిష్ సరిహద్దు సమీపంలో దొరికిన అడవి పంది మృతదేహంలో గుర్తించినట్లు, దీనిపై మ‌రిన్ని పరీక్షలు నిర్వహిస్తున్నట్లు వ్యవసాయ మంత్రి జూలియా క్లోక్నెర్ చెప్పారు.

వివిధ దేశాలకు పందులను జర్మనీ ఎగుమతి చేస్తుంది. ముఖ్యంగా చైనాకు పందుల అతిపెద్ద ఎగుమతిదారు జర్మనీనే. ఇప్పుడు స్వైన్‌ ఫీవర్‌ కేసు నమోదైనందున ఎగుమతులను నిషేధించాలని ఆ దేశం నిర్ణయించింది. దీంతో తీవ్ర ఆర్థిక నష్టం వాటిల్లనుంద‌ని ఆర్చర్ ఫైనాన్షియల్ సర్వీసెస్ సీనియర్ అకౌంట్ ఎగ్జిక్యూటివ్ డెన్నిస్ స్మిత్ అభిప్రాయపడుతున్నాడు.

Latest Updates