బీహార్‌లో  నిర్భయ తరహా ఘటన.. మూగ, చెవిటి బాలికపై గ్యాంగ్ రేప్

సాక్షాధారాలు లేకుండా బాలిక కళ్లు తొలగించే యత్నం 

పాట్నా: మధ్యప్రదేశ్ లోని సిద్దిలో నిర్భయ తరహా ఘటన కళ్లముందు మెదులుతున్న తరుణంలోనే బీహార్ లో మరో దిగ్భ్రాంతికరమైన సంఘటన చోటు చేసుకుంది.  అర్రా జిల్లాలో నలుగురు వ్యక్తులు 15 ఏళ్ల బాలికపై సామూహిక అత్యాచారం చేశారు. పుట్టుకతో చెవిటి, మూగ అయిన ఈ బాలిక కళ్లు లేకుండా చేస్తే.. ఏం చేసినా.. తమ గురించి ఎలాంటి సాక్షాధారాలు దొరకవని కళ్లు లేకుండా కుళ్లుబొడిచారు. మధుబని జిల్లాలోని హలర్కి పోలీసు స్టేషన్ పరిధిలో జరిగిన ఘటన దేశవ్యాప్తంగా కలకలం రేపుతోంది. జిల్లా ఎస్పీ సత్యప్రకాశ్ కథనం మేరకు పుట్టుకతో చెవిటి,మూగ  అయిన ఈ 15 బాలిక తన గ్రామ శివార్లలోని పొలంలో మేకలకు గడ్డి కోసం తీసుకెళ్లింది. ఒంటరిగా కనిపించిన ఈ బాలిక మూగ, చెవిటి కావడంతో అత్యాచారం చేశారు.. భయంతో ఎవరికైనా చెబుతుందేమోనని.. కళ్లు లేకుండా చేసేందుకు బలమైన ఆయుధంతో కళ్లపై దాడి చేశారు. బాలిక కోసం వెళ్లిన సహచర పిల్లలు పొలంలో స్పృహ తప్పి పడి ఉన్న బాలికను చూసి గ్రామస్తులకు సమాచారం ఇచ్చారు. బాలికను వెంటనే ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కళ్లను కుళ్లబొడవడంతో తీవ్ర రక్తస్రావం జరిగి పరిస్థితి విషమంగా ఉన్నట్లు చెబుతున్నారు. ఇప్పట్లో ఏమీ చెప్పలేమంటున్నారు. ఘటన మీడియాలో సంచలనం రేపడంతో పోలసులు అలర్టయ్యారు. ఇప్పటికే ముగ్గురు అనుమానితులను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు.

ఇవీ చదవండి..

జేఈఈ స్టూడెంట్ల కోసం అమెజాన్ అకాడమీ

పతంగులు ఎందుకు ఎగరేస్తరో తెలుసా?

జాక్‌మా కంపెనీలను జాతీయం చేసే యోచనలో చైనా

సంక్రాంతి వేడుకంతా రైతుదే

Latest Updates