విజయ్ మారిపోయాడు.. డియర్ కామ్రేడ్ ట్రైలర్ విడుదల

విజయ్ దేవరకొండ, రష్మిక జంటగా నటించిన లవ్, ఎమోషనల్ ఎంటర్ టైనర్ డియర్ కామ్రేడ్ ట్రైలర్ విడుదలైంది. కాలేజీ కుర్రాడి జీవితం… పాలిటిక్స్, ప్రేమ కారణంగా ఎలాంటి మలుపులు తిరిగిందనేది ఈ సినిమా కథాంశం.  ఒక కామ్రేడ్ పోరాడితే అతడికి ఆ పోరాటం హాయినివ్వాలి… స్వేచ్ఛనివ్వాలి.. నిన్ను చూస్తే అలా లేవు అనే డైలాగ్ తో ట్రైలర్ మొదలవుతుంది. మూవీ స్క్రీన్ ప్లేను ట్రైలర్ లో చూపించారు. విజయ్, రష్మిక మధ్య ప్రేమ, ఘర్షణను కూడా ఎక్స్ ప్లోర్ చేశారు. భరత్ కమ్మ దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీ త్వరలోనే విడదల కానుంది. జస్టిన్ ప్రభాకర్ మ్యూజిక్ అందించాడు.

“వచ్చినప్పుడు ఎంతో అందంగా ఉన్న ప్రేమ.. వెళ్లిపోయాక ఎందుకింత బాధపెడుతుంది..” , “ధైర్యం, తెగువ మంచివే కానీ.. గొడవల్లో పోగొట్టుకునేవే అన్నింటికన్నా ఎక్కువ బాధపెడతాయి “, “ఇష్టం కోసం ఫైట్ చెయ్” లాంటి డైలాగ్స్ ఆకట్టుకుంటాయి. వచ్చీరాని హిందీలో విజయ్ చెప్పే సంభాషణలు.. కైసీ కర్తీ ఇసీ దోస్తీ, చాలా కష్ట్ హే లాంటివి నవ్వులు పూయిస్తాయి.

రష్మిక స్టేట్ క్రికెట్ ప్లేయర్ రోల్ చేస్తోంది. విరహం పొంగెనే.. హృదయం ఊగెలే పాట .. అధరం అంచులే మధురం కోరెలే.. పాట చిత్రీకరణ ఆకట్టుకుంటుంది.

తెలుగు నేటివిటీకి కొంత దూరం అనిపించినప్పటికీ… ఓ ఇంటెన్స్ ఉన్న సినిమా చూడబోతున్నామన్న ఫీల్ ను కలిగించింది డియర్ కామ్రేడ్ ట్రైలర్. మూవీ త్వరలోనే విడుదల కానుంది.

Latest Updates