డియర్​ పబ్​జీ ప్లేయర్స్.. జస్ట్​ రిలాక్స్!

గేమ్​ బ్యాన్​పై మానసిక ఆందోళన వద్దు

నిన్నటిదాకా చిన్నాపెద్ద గంటల తరబడి పబ్​జీలోనే..

ఇప్పుడు కోపం, చిరాకు పెరిగే ప్రమాదం

మరో అడిక్షన్ వైపు మళ్లే చాన్స్

పేరెంట్స్ ప్రిపేర్డ్​గా ఉండాలంటున్న సైకాలజిస్ట్​లు

సిటీలోని విష్ణుపురి కాలనీకి చెందిన సాంబశివ టెన్త్​ క్లాస్ ​స్టూడెంట్. ఎప్పుడూ పబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌జీ గేమ్‌‌‌‌‌‌‌‌ ఆడుతూ చదువును నిర్లక్ష్యం చేస్తున్నాడు. మొదట్లో తల్లిదండ్రులు చూసీచూడనట్లు ఉన్నారు. ఎగ్జామ్స్ టైమ్​లోనూ గంటల తరబడి గేమ్ ఆడుతుండడంతో తల్లి గట్టిగా మందలించింది. మనస్తాపానికి గురైన సాంబశివ రూమ్ లోకి సూసైడ్​ చేసుకున్నాడు. గతేడాది ఏప్రిల్​లో జరిగిన ఘటన ఇది.

పుప్పాలగూడలోని శ్రీరాంనగర్‌‌‌‌‌‌‌‌లో ఉండే సమీర్‌‌‌‌‌‌‌‌ ఇంటర్​ ఫస్టియర్​ చదువుతున్నాడు. పబ్‌‌‌‌‌‌‌‌ జీ ఆడుతూ స్టడీ పక్కన పెట్టడంతో తల్లి సెల్‌‌‌‌‌‌‌‌ఫోన్‌‌‌‌‌‌‌‌ తీసుకుంది. దాంతో సమీర్‌‌‌‌‌‌‌‌ ఇంటి నుంచి వెళ్లి ఏటీఎంలో మనీ డ్రా చేసుకుని బస్​లో ముంబయి బయల్దేరాడు. దారిలో ఒక స్టేషన్ దగ్గర బస్ మిస్ అవడంతో వేరొకరి మొబైల్​ నుంచి తల్లికి ఫోన్ చేసి ‘‘నీ కొడుకును కిడ్నాప్ చేశాం. 3 లక్షలు ఇస్తే విడిచి పెడ్తాం”అని బ్లాక్​మెయిల్​ చేశాడు. తల్లి పట్టించుకోకపోవడంతో అక్కడి నుంచి అమ్మమ్మ ఇంటికి వెళ్లేందుకు ఆన్​లైన్​లో టికెట్ బుక్ చేసుకున్నాడు. ఆ మెసేజ్ ద్వారా పోలీసులు అతన్ని పట్టుకుని తల్లికి అప్పగించారు. 2019 అక్టోబర్ లో ఇది జరిగింది.

హైదరాబాద్, వెలుగుటైంపాస్​గా మొదలుపెట్టిన ఆన్​లైన్​ గేమ్​లు ప్రాణాలు తీసేదాకా వస్తున్నాయి. బ్లూ వేల్ గేమ్ నుంచి పబ్​జీ దాకా అనేకమందిపై ఎఫెక్ట్​చూపాయి. దేశవ్యాప్తంగా 3.3కోట్ల మంది పబ్ జీ గేమ్ లో యాక్టివ్ గా ఉండగా, గ్రేటర్ హైదరాబాద్​లోనూ ఎక్కువమంది యూజర్లు ఉన్నారు. లాక్ డౌన్ లో అనేకమంది ఈ గేమ్​ని ఇన్ స్టాల్ చేసుకున్నారు. కొందరు గ్రూపులుగా డివైడ్ అయ్యి ఆడగా, మరికొందరు ఆన్​లైన్ ​టోర్నమెంట్స్​దాకా వెళ్లారు. తెలియకుండానే గేమ్​కి అడిక్ట్​ అయ్యి చిత్రవిచిత్రంగా ప్రవర్తించేవారు. మందలిస్తే ఎలా రెస్పాండ్​ అవుతారోనన్న భయంతో ఒక దశలో తల్లిదండ్రులు కూడా ఏమీ అనలేని పరిస్థితి నెలకొంది. బుధవారం పబ్‌‌‌‌‌‌‌‌జీ గేమ్​ని కేంద్రం బ్యాన్​ చెయ్యడాన్ని చాలామంది తట్టుకోలేకపోతున్నారు. ఏదైనా వ్యసనాన్ని ఒకేసారిఆ పేస్తే మానసిక స్థితి నిలకడగా ఉండదని, అలాంటి వారి విషయంలో పేరెంట్స్​ జాగ్రత్తలు తీసుకోవాలని సైకాలజిస్ట్ లు సూచిస్తున్నారు.

డైవర్ట్ అయ్యేలా..

మందుకు బానిసైన వాళ్లలో చాలామంది దానికి దూరమవ్వాలంటే మరొక అడిక్షన్ వైపు మళ్లుతుంటారు. పబ్​జీకికి అడిక్ట్ అయినవారు కూడా ఇప్పుడు ఇతర అడిక్షన్ వైపు డైవర్ట్​ అయ్యే ప్రమాదం ఉందని సైకాలజిస్ట్​లు హెచ్చరిస్తున్నారు. నిద్ర లేచింది మొదలు అర్ధరాత్రి దాకా ఈ గేమ్​తోనే సావాసం చేసిన వాళ్లు ఎందరో. వారిలో పదేండ్ల నుంచి 30ఏండ్ల వారి వరకూ ఉన్నారు. టైంపాస్ అవడం లేదని, గేమ్ ద్వారా ఆన్​లైన్​ కనెక్టివిటీ పెరుగుతుందని ఆడుతున్న చాలామంది చెప్పేవారు. గేమ్​లో అచీవ్​మెంట్స్, అప్రిషియేషన్స్ వంటివి ఉండటం వల్ల ఎక్కువగా అడిక్ట్ అయ్యారు. అలాంటి గేమ్​ను ఒకేసారి మానేయడం వల్ల పిల్లల్లో యాంగర్ ఇష్యూస్ పెరిగే అవకాశం ఉందని సైకాలజిస్ట్​లు చెప్తున్నారు. దాన్నుంచి బయటకు తీసుకొచ్చేందుకు పేరెంట్స్ ప్రిపేర్ అయి ఉండాలంటున్నారు. పిల్లలను ఒంటరిగా వదలకుండా కనిపెడుతూ ఉండాలని, వేరే యాక్టివిటీస్​లో బిజీ చేయాలని సూచిస్తున్నారు. లోన్లీ ఫీల్ రానివ్వకూడదంటున్నారు. మరీ అగ్రెసివ్​గా ప్రవర్తిస్తే సైక్రియాట్రిస్ట్  ద్వారా సెషన్స్ ఇప్పించాలని చెప్తున్నారు.

మరొక అడిక్షన్​వైపు మళ్లకుండా..

ఏదైనా అడిక్షన్ నుంచి బయటపడటాన్ని విత్ డ్రాల్స్ అంటారు. ఇప్పుడు పబ్​జీ అడిక్ష న్ కూడా అంతే. ఏదైనా అలవాటును ఒక్క సారిగా మానేస్తే అది మానసిక పరిస్థితిపై బాగా ప్రభావం చూపిస్తుంది. గేమ్ బ్యాన్ తో చాలామందిలో ఇరిటెబులిటీ, అగ్రెసివ్ నెస్, ఆర్గ్యుమెంట్ నేచర్ పెరగొచ్చు. ఏ విషయం పైనా కాన్సట్రేట్ చేయాలనుకోరు. ఇతరులు చెప్పేది వినిపించుకోరు. ఊరికే కోపానికి వస్తుంటారు. ఈ గేమ్​ను మర్చిపో యేందుకు ఇంకేదో వ్యసనం వైపు మళ్లేం దుకు ప్రయత్నిస్తారు. అలాంటి వారి విష యంలో పేరెంట్స్​ జాగ్రత్తగా ఉండాలి. గేమ్ లైఫ్ కాదని అర్థమయ్యేలా చెప్పాలి. ఇలాంటి టైమ్​లో ఫ్యామిలీ సపోర్ట్ అవసరం. – డాక్టర్​ హరిణి, సైకియాట్రిస్ట్, కేర్ హాస్పిటల్స్​

అర్ధరాత్రి దాకా గేమ్లోనే..

నాకు ఇద్దరు పిల్లలు. స్టడీస్ వల్ల స్మార్ట్ ఫోన్ కొనివ్వాల్సి వచ్చింది. అప్పటి నుంచి పబ్​జీ తప్ప ఇంకోటి లేదు. అర్ధరాత్రి వరకు గట్టిగా అరుస్తూ గేమ్ ఆడుతుంటారు. కొన్ని కంట్రోల్ చేయడానికి ట్రై చేసినా వినిపించుకోరు. అదే లోకమై వేరే ఈ విషయం మీద కూడా ఫోకస్ చేయట్లేదు. గేమ్ బ్యాన్ చేశారని తెలిసి రిలీఫ్​ ఫీల్​ అయ్యాం.‑ మమత, పేరెంట్, మధురానగర్

ఇప్పుడు బోరింగ్

నాకు మొదట్లో గేమ్ అంటే పెద్దగా ఇంట్రెస్ట్ ఉండేది కాదు. ఫ్రెండ్స్ ఫోర్స్ తో ఆడేవాన్ని. కానీ లాక్ డౌన్ లో ఎటూ వెళ్లే చాన్స్​ లేకపోవడంతో పబ్​జీ ఆడటం అలవాటైంది. ఇంక ఇప్పుడంతా బోరింగ్. ‑ విక్రమ్, స్టూడెంట్, మదాపూర్.

 

 

Latest Updates