
ప్రస్తుతం కరోనా క్రైసిస్ లో స్మోకింగ్ చాలా ప్రమాదం. ముక్కు, గొంతు నోటి నుంచి కరోనా వైరస్ శరీరంలోకి ప్రవేశిస్తుంది. స్మోకింగ్ చేయని వారికంటే స్మోకింగ్ చేసే వారిపై కరోనా ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఆ విషయం తెలిసి స్మోకర్స్..స్మోకింగ్ మానేయాలని ప్రయత్నాలు చేస్తుంటారు. కానీ అది సాధ్యపడక కరోనా బారిన పడాల్సి వస్తుంది.
అయితే అలాంటి స్మోకర్స్ ఈ టిప్స్ ను పాటించాలని, తద్వారా వైరస్ బారిన పడకుండా సురక్షితంగా ఉండొచ్చంటూ ఢిల్లీలోని సరోజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ జనరల్ ఫిజిషియన్ ముంద్రా ఈ టిప్స్ ను ఫాలో అవ్వాలని చెబుతున్నారు.
1. హైడ్రేటెడ్ గా ఉండండి
ధూమపానం ప్రియులు కరోనా టైంలో ఆరోగ్యంగా ఉండాలన్నా, లంగ్స్ జాగ్రత్తగా ఉండాలన్న తప్పని సరిగా మంచినీళ్లు తాగాలని డాక్టర్ మంద్రా చెబుతున్నారు. అలా వాటర్ తాగడం వల్ల లంగ్స్ శుభ్రంగా ఉండడమేకాదు..వాటి పనితీరు బాగుంటుందని అన్నారు.
2. క్రమం తప్పకుండా వ్యాయామం
ప్రతీరోజూ వ్యాయామం చేయడం వల్ల లంగ్స్ ఆరోగ్యంగా ఉండటమే కాదు. గుండె పనితీరు బాగుంటుంది.ఎక్కువ ఆక్సిజన్ పీల్చుకొని కార్బన్ డయాక్సైడ్ ను విడుదల చేయడానికి వ్యాయామం బాగా పనిచేస్తుంది. వ్యాయమ సమయంలో లంగ్స్ కీరోల్ ప్లే చేస్తాయి. దీంతో లంగ్స్ క్లీన్ గా ఉంటాయి.
3. కాలుష్యానికి దూరంగా ఉండాలి
ఈ కరోనా టైమ్ లో స్మోకర్స్ తమ లంగ్స్ జాగ్రత్తగా ఉంచుకోవాలంటే వాయి కాలుష్యానికి దూరంగా ఉండాలని డాక్టర్ చంద్ర సూచించారు. భారీ ట్రాఫిక్ ఉన్న ప్రాంతాలు లేదా, నిర్మాణ పనులు, మైనింగ్ సైట్లలో సందర్శించడాన్ని విరమించుకోవాలి.
4. రెగ్యులర్ స్క్రీనింగ్
రెగ్యులర్ స్క్రీనింగ్ టెస్ట్ చేయించుకోవడం వల్ల అనే వ్యాధుల నుంచి సురక్షితంగా ఉండొచ్చని డాక్టర్లు చెబుతున్నారు. మనం ఎంత ఆరోగ్యంగా ఉన్నా స్క్రీనింగ్ టెస్ట్ లతో మనలోని అనారోగ్య సమస్యల్ని గుర్తించవచ్చు. స్క్రీనింగ్ టెస్ట్ లు మన బ్రీతింగ్ ను అంచనా వేస్తూ డాక్టర్ ట్రీట్మెంట్ చేస్తారని, అనారోగ్యంగా ఉంటే మెడిసిన్ తో నయం చేసుకోవచ్చని ఢిల్లీలోని సరోజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ జనరల్ ఫిజిషియన్ ముంద్రా తెలిపారు.