ఆత్మహత్యకు పాల్పడిన ASI మృతి

బాలాపూర్‌ పోలీస్‌స్టేషన్‌ ఎదుట ఆత్మహత్యకు యత్నించిన ASI నర్సింహ మృతి చెందారు. కంచన్‌బాగ్‌లోని డీఆర్డీవో అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు. క్రమశిక్షణ చర్యలో భాగంగా బదిలీ చేయడంతో నర్సింహ కుంగిపోయారు. సీఐ అక్రమంగా తనపై తప్పుడు నివేదిక ఇచ్చారని ఆయన ఆరోపించారు.

బాలాపూర్ పోలీస్ స్టేషన్ లో ఏఎస్ఐ గా విధులు నిర్వహించిన నరసింహులు అదే పోలీస్ స్టేషన్ ముందు పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకున్నాడు. వెంటనే గమనించిన అక్కడి ఉద్యోగులు మంటలార్పి అతడిని   దగ్గరలో ఉన్న అపోలో DRDO హాస్పిటల్ కి తరలించారు. ఇటీవలే బాలాపూర్ నుంచి మంచాల పోలీస్ స్టేషన్ కు ASI గా బదిలీ అయ్యారు.