పాక్ లో బాంబ్ బ్లాస్ట్..8 మంది మృతి

పాకిస్తాన్ లోని లాహోర్ లో బాంబ్ బ్లాస్ట్ జరిగింది. బుధవారం జరిగిన ఈ  పేలుడులో 8 మంది మృతి చెందగా 25 మందికి గాయాలయ్యాయి.  పోలీస్ వాహనం టార్గెట్ గా సూఫీ పుణ్యక్షేత్రం డేటా దర్బార్ వద్ద  పేలుడు జరిగిందని  లాహోర్ ఆపరేషన్స్ డీఐజీ అస్ఫక్ అహ్మద్ ఖాన్ తెలిపారు. ఈ ఘటనలో పోలీసు వాహనం ముక్కలు ముక్కలైంది.  పేలుడులో గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.  ఈ ఘటనను పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఖండించారు. పేలుళ్లలో ప్రాణాలు కోల్పోయినవారి కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు.

 

Latest Updates