ఢిల్లీ అర్పిత్ ప్యాలెస్ ప్రమాదం : 17కు పెరిగిన మృతులు

ఢిల్లీ : కరోల్‌బాగ్‌ అర్పిత్‌ ప్యాలెస్‌ హోటల్ లో జరిగిన అగ్నిప్రమాదంలో మృతు సంఖ్య 17కు పెరిగింది. ఈ ఉదయం హోటల్ లో ఫైర్ యాక్సిడెంట్ జరిగింది. అగ్ని ప్రమాదంలో గాయపడిన వారిని వెంటనే హాస్పిటల్ కు షిఫ్ట్ చేశారు. ఉదయం 9 మంది చనిపోయారని పోలీసులు చెప్పారు.  చికిత్స పొందుతూ  మరో 8మంది చనిపోయారు. మరికొందరు చికిత్స పొందుతున్నారు. ఈ ప్రమాదంలో ముగ్గురు గల్లంతైనట్లు సమాచారం.

వేకువ జామున హోటల్ లో మంటలు చెలరేగుతున్న విషయం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. పెద్ద అగ్నిమాపక యంత్రాలతో మంటలను కష్టమ్మీద కంట్రోల్ చేశారు.

గొట్టపు మార్గంలో చెలరేగిన మంటలు ఇతర గదులకు వ్యాపించడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని  ఢిల్లీ హోటల్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ బాలన్ మనీ అన్నారు. లైసెన్స్, ఇతర అన్ని వసతులను పరిశీలించిన తర్వాతనే ఈ హోటల్ కు పర్మిషన్ వచ్చిందని ఆయన అన్నారు. కొన్నిసార్లు చిన్నఇళ్లలోనూ ప్రమాదాలు జరుగుతుంటాయి అని ఆయన చెప్పారు. 

 

 

Latest Updates