అమెరికాలో 50 వేలు దాటిన మృతుల సంఖ్య

వాషింగ్టన్: అమెరికాలో కరోనావైరస్ తో మరణించిన వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. మృతుల సంఖ్య శుక్రవారం నాటికి 50 వేలు దాటింది. వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య 9 లక్షలకు చేరువలో ఉంది. ఇప్పటివరకు 8,91,627 మంది వైరస్ బారిన పడగా అందులో 82,843 మంది కోలుకున్నారు. చనిపోయిన వారి సంఖ్య 50,372 మందిగా రికార్డయింది. లాక్​డౌన్ ఎత్తివేయాలా వద్దా అనేదానిపై రాష్ట్రాలకు అధికారాలు కట్టబెట్టిన యూఎస్ ప్రెసిడెంట్ ట్రంప్ కొన్ని రాష్ట్రాల గవర్నర్ల నిర్ణయాలపై మండిపడుతున్నారు. లాక్​డౌన్ నుంచి మినహాయింపులు ప్రకటించిన జార్జియా స్టేట్ గవర్నర్ తీసుకున్న నిర్ణయాలను సమర్థిస్తూనే.. మొదటి విడతలోనే బ్యూటీ పార్లర్లు, స్పాలు, హెయిర్ కటింగ్ సెలూన్లు, టాటూ సెంటర్లను ఓపెన్ చేసే వెసులుబాట్లు కలిగించడం మంచిదికాదన్నారు. అమెరికా అంతటా కఠిన ఆంక్షలు అమలు చేయాలని సూచించారు.

Latest Updates