పిల్లల్ని కనకూడదని నిర్ణయించుకున్నా..!

ఒకప్పుడు హీరోయిన్లు వ్యక్తిగత విషయాలు మాట్లాడటానికి ఇష్టపడే వారు కాదు. కానీ ఈ తరం నటీమణులు ఏ విషయమైనా కుండ బద్దలు కొట్టేస్తున్నారు. ముఖ్యంగా ‘మీటూ’ ఉద్యమం మొదలయ్యాక ఏ విషయం గురించైనా ధైర్యంగా మాట్లాడుతున్నారు. రీసెంట్‌‌గా ఓ ఇంటర్వ్యూలో శ్రద్ధా శ్రీనాథ్‌‌ కూడా ఎలాంటి మొహమాటం లేకుండా కొన్ని విషయాలను చర్చించింది. సమాజంలో మహిళలు ఎదుర్కొంటున్న సమస్యల గురించి మాట్లాడింది శ్రద్ధ. అత్యాచారాన్ని మాత్రమే నేరంగా పరిగణిస్తున్నారని, నిజానికి మహిళలను తప్పుడు దృష్టితో చూడటం, తప్పుగా కామెంట్​ చేయడం, వారిని ఫాలో అయ్యి ఇబ్బంది పెట్టడం లాంటివన్నీ నేరాలే అంది.

మహిళలు మారుతున్నారు కానీ వారిని చూసే విధానం మాత్రం మారలేదంది. ఇవన్నీ చూసిన తర్వాత తాను అస్సలు పిల్లల్ని కనకూడదని నిర్ణయించుకున్నట్లు తెలిపింది. ముందు తరాల వాళ్లు చాలామంది పిల్లల్ని కన్నారని, తన తల్లిదండ్రులు ఇద్దరికి జన్మినిచ్చారని, తాను మాత్రం అసలు పిల్లల్ని కనేది లేదని తెగేసి చెప్పింది. ఈ నిర్ణయాన్ని బట్టి తనను అంచనా వేయవద్దని, తన చదువు, తెలివితేటలను బట్టి తానేంటో అర్థం చేసుకోవాలని చెప్పింది. బలమైన ఆలోచనలున్న ఆధునిక మహిళ పాత్రల్లో కనిపించే శ్రద్ధ.. నిజ జీవితంలో కూడా ఇంత
క్లారిటీతో ఉండటం మెచ్చుకోదగ్గ విషయమే.

Latest Updates