హైదరాబాద్ పేషెంట్ కు తగ్గిన కరోనా వైరస్

గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న పేషెంట్ కు కరోనా వైరస్ తగ్గుముఖం పట్టినట్లు తెలుస్తోంది. హైదరాబాద్ మహీంద్ర హిల్స్ కు చెందిన ఓ యువకుడు బెంగళూరులో సాఫ్ట్ వేర్ ఇంజినీర్ గా ఉద్యోగం చేస్తున్నాడు. ఆఫీస్ నిమిత్తం బెంగళూరు నుంచి దుబాయ్ వెళ్లిన బాధితుడు అక్కడ కొన్నిరోజుల పాటు హాంకాంగ్ కు చెందిన సహచర ఉద్యోగులతో కలిసి పనిచేశాడు. అయితే వారితో కలిసి పనిచేయడంతో టెక్కీకి కరోనా సోకినట్లు వైద్యులు గుర్తించారు.  అయితే ఆఫీస్ పని పూర్తి చేసుకొని యువకుడు దుబాయ్ నుంచి బెంగళురుకు వచ్చాడు. బెంగళూరు నుంచి బస్సులో హైదారబాద్ కు వచ్చాడు. వచ్చిన నాటి నుంచి బాధితుడికి ఫివర్, జ్వరం రావడంతో అపోలో ఆస్పత్రి వైద్యుల్ని ఆశ్రయించాడు. ఎంతకీ తగ్గక పోవడంతో అనుమానం వ్యక్తం చేసిన అపోలో వైద్యులు గాంధీకి తరలించి కరోనా టెస్ట్ లు నిర్వహించారు. బ్లడ్ శాంపిల్స్ ను పూణే వైరాలజీ ల్యాబ్ కు పంపించగా..అందులో పాజిటీవ్ వచ్చింది. దీంతో అప్రమత్తమైన ప్రభుత్వం యువకుణ్ని గాంధీ ఆస్పత్రి ఐసోలేషన్ వార్డ్ లో ఉంచి చికిత్సలు నిర్వహిస్తుంది.

తాజాగా ఆ యువకుడికి కరోనా పరీక్షలు నిర్వహించగా నెగిటీవ్ వచ్చినట్లు తెలుస్తోంది. దీన్ని కన్ఫామ్ చేసుకునేందుకు బ్లడ్ శాంపిల్స్ ను పూణేకి పంపించారు.

Latest Updates