సెక్రటేరియట్ షిప్టింగ్ తో తగ్గుతున్న జీవోలు

  • గతంలో రోజూ 30..ఇప్పుడు కేవలం 10 లోపే
  • నెలాఖరులోగా బీఆర్కే భవన్ లో సర్వర్ ఏర్పాటు

సెక్రటేరియట్ షిప్టింగ్ తో వివిధ శాఖల నుంచి విడుదల అవుతున్న జీవోల సంఖ్య తగ్గుతోంది. షిఫ్టింగ్ స్టార్ట్ కాకముందు నిత్యం 30 జీవోలు విడుదలయ్యేవి.. ఇప్పుడు అప్​లోడ్​చేస్తున్న జీవోల సంఖ్య 10 కి మించడంలేదు. షిప్టింగ్ చివరి దశకు చేరుకున్నప్పటికి ఇంకా ఐటీ సర్వర్లు, స్వాన్ ఇంకా స్టార్ట్ కాలేదు. ఐటీ డిపార్ట్​మెంట్​ను త్వరలో బీఆర్కే భవన్​కు షిఫ్ట్​ చేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. పూర్తిస్థాయిలో షిఫ్ట్​ చేయడానికి పది రోజులు పడుతుందని అంటున్నారు. ప్రస్తుతం సెక్రటేరియట్ క్యాంపస్ నెట్ వర్క్ (ఎస్ సీఏఎన్), స్టేట్ వైడ్ ఏరియా నెట్ వర్క్( ఎస్ డబ్ల్యూఏఎన్ ) లోకల్ ఏరియా నెట్ వర్క్ ద్వారా వివిధ శాఖలకు హైస్పీడ్ ఇంటర్ నెట్, సర్వర్లు, ప్రతిశాఖకు లాగిన్ ఐడీ, పాస్ వర్డ్ అవకాశం కల్పించారు. నిత్యం ఆయా శాఖలలో అనుమతి ఉన్న అధికారులు జీవోలను  goir.telengana.gov.in లో పబ్లిక్ కు అందుబాటులో ఉండేలా అప్ లోడ్ చేస్తున్నారు. శాఖల షిప్టింగ్ తర్వాత ఐటీ శాఖ బీఆర్కే భవన్ కు బీఎస్ ఎన్ ఎల్ ద్వారా హైస్పీడ్ ఇంటర్ నెట్ సౌకర్యం కల్పించింది. ఈ నెలాఖరులోగా బీఆర్కే భవన్​లో సర్వర్​ ఏర్పాటు చేయనున్నట్లు అధికారులు చెప్పారు. ఆ తర్వాతే పూర్తిస్థాయిలో సేవలు అందుబాటులోకి వస్తాయని వివరించారు.

Latest Updates