ఫస్ట్ లుక్ పై ప్రశంసలు : యాసిడ్ బాధితురాలిగా దీపికా

యాసిడ్‌ బాధితురాలు లక్ష్మీ అగర్వాల్‌ నిజ జీవితకథతో ‘ఛపాక్‌’ సినిమా తెరకెక్కుతోంది.  మాలతి క్యారెక్టర్ లో బాలీవుడ్ హీరోయిన్ దీపికా పదుకొనె నటిస్తున్న ఈ మూవీ సోమవారం ప్రారంభమైంది. ఈ సందర్భంగా ట్వీట్ చేసిన దీపిక.. “నాకు జీవితాంతం గుర్తుండిపోయే పాత్ర ‘మాలతీ’ అని తెలిపింది. ఈ సినిమాకు సంబంధించి ఇన్‌ స్టాగ్రామ్‌ లో రివీల్‌ చేసిన ఫస్ట్‌ లుక్‌ కు గంటలోపే 5 లక్షలకుపైగా లైకులు వచ్చాయి. చాలెంజింగ్ క్యారెక్టర్ పోషిస్తున్నావంటూ దీపికపై నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. అప్పుడే అంచనాల్ని పెంచేస్తున్న ‘ఛపాక్‌’ సినిమా వచ్చే ఏడాది జనవరి 10న విడుదలవుతుందని తెలిపింది యూనిట్.

ఇంటర్వ్యూలో దీపిక మాట్లాడుతూ.. ‘పద్మావత్‌’  తర్వాత అలాంటి సినిమాలు చేయడానికి మానసికంగా సిద్ధంగా లేను. ఏదైనా లవ్‌ స్టోరీ చేయాలనుకున్నా.  ఎప్పుడైతే మేఘనా గుల్జార్‌ ‘ఛపాక్‌’ స్క్రిప్ట్‌ వినిపించిందో అప్పుడే నా నిర్ణయాన్ని మార్చుకున్నా. స్టోరీ విన్న ఐదు నిమిషాల్లోనే సినిమా ఒప్పుకోవడమే కాకుండా, ఆ సినిమాకి ప్రొడ్యూసర్‌ గా మారాలని నిర్ణయించుకున్నాను’ అని తెలిపింది.

Latest Updates