శ్రీదేవి జీవితచరిత్రపై బుక్ రిలీజ్

న్యూఢిల్లీ: ప్రముఖ సినీ నటి శ్రీదేవి జీవిత చరిత్రపై ‘శ్రీదేవి: గర్ల్​ వుమెన్​ సూపర్​స్టార్​’ అనే పుస్తకం విడుదలైంది. ఆదివారం న్యూఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో శ్రీదేవి భర్త బోనీ కపూర్, బాలీవుడ్​ నటి దీపికా పదుకొనె ఈ పుస్తకాన్ని ఆవిష్కరించారు. బుక్​ లాంచ్​ సందర్భంగా శ్రీదేవిని గుర్తు చేసుకుని బోనీ కపూర్​ కంటతడి పెట్టారు. ఆ సమయంలో పక్కనే ఉన్న దీపిక ఆయనను ఓదార్చారు. తాను కెరీర్​ మొదలుపెట్టిన రోజుల్లో శ్రీదేవి, బోనీ కపూర్​ తనకు ఎంతో సపోర్ట్​గా నిలిచారని, తాను ఈ స్టేజ్​లో ఉండటానికి వారిద్దరే కారణమని దీపిక గుర్తు చేసుకున్నారు. తన ప్రతి సినిమా రిలీజ్​ అయిన తర్వాత పర్సనల్​గా శ్రీదేవి మెసేజ్​ చేసేవారన్నారు. శ్రీదేవితో తనకున్న బంధం గురించి చాలా మందికి తెలియదని, శ్రీదేవి సినీ నటి మాత్రమే కాదని, అద్భుతమైన వ్యక్తి అని కొనియాడారు. శ్రీదేవి జీవిత చరిత్ర పుస్తకాన్ని ఆవిష్కరించడం గొప్ప గౌరవంగా భావిస్తున్నానని చెప్పారు. బుక్​ రచయిత సత్యార్థ్​ నాయక్​ మాట్లాడుతూ.. తెలుగు, హిందీ, తమిళ్​, కన్నడ, మలయాళ సినిమా ఇండస్ట్రీల్లో ఆమె వర్క్​ను ఈ పుస్తకం తెలియజేస్తుందని చెప్పారు. ఈ పుస్తకం తాను శ్రీదేవికి ఇచ్చే నివాళి అని ఆయన పేర్కొన్నారు. వందలాది సినిమాల్లో నటించిన శ్రీదేవి గత ఏడాది ఫిబ్రవరిలో దుబాయ్​లోని ఓ హోటల్​లో మరణించింది.

Latest Updates