విచారణలో మూడు సార్లు కన్నీళ్లు పెట్టుకున్న దీపికా

బాలీవుడ్ డ్రగ్స్ కేసుకు సంబంధించి శనివారం నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (NCB) హీరోయిన్లు దీపికా పదుకొణే,సారా అలీ ఖాన్,శ్రద్దా కపూర్లను విచారించిన సంగ‌తి తెలిసిందే. అయితే విచారణలో ఎన్‌సీబీ అధికారుల‌కు అడిగిన ప్రశ్నలకు దీపిక క‌న్నీళ్లు పెట్టుకున్న‌ట్టు వార్త‌లు వస్తున్నాయి. విచారణ నిమిత్తం శనివారం భర్త రణ్‌వీర్ సింగ్‌తో కలిసి ముంబైకి వచ్చిన దీపికా.. ఉదయం 9.45గం. సమయంలో ఎన్‌సీబీ అధికారుల ఎదుట విచారణకు హాజరయ్యారు. 10.50గం. సమయంలో ఆమె మేనేజర్ కరీష్మా ప్రకాష్ కూడా ఎన్‌సీబీ కార్యాలయానికి చేరుకున్నారు.

2017లో దీపికా అడ్మిన్‌గా ఉన్న ఓ వాట్సాప్ గ్రూపులో డ్రగ్స్ చాటింగ్‌కి సంబంధించి అధికారులు ఆమెను ప్రశ్నించగా… ఆ ప్రశ్నలకు ఉక్కిరిబిక్కిరైన దీపికా… మొత్తం 3 సార్లు కన్నీళ్లు పెట్టుకున్నట్లు స‌మాచారం. . విచారణలో ‘ఎమోషనల్ కార్డు’ ప్లే చేయవద్దని దీపికా అధికారులతో చెప్పినట్లు తెలుస్తోంది. తాను మాత్రం డ్రగ్స్ తీసుకోవడం కానీ, ఇతరులకు సప్లై చేయడం కానీ చేయలేదని అధికారుల‌తో చెప్పినట్లు సమాచారం. దాదాపు 6 గంటల పాటు దీపికాను అధికారులు విచారించారు. అయితే విచార‌ణ‌లో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణంపై ఆత్మహత్య కానీ, రియా చక్రవర్తిపై కొనసాగుతున్న దర్యాప్తుకు సంబంధించి కానీ ఎటువంటి ప్రశ్నలు అడగలేదని తెలిసింది.

 

Latest Updates