మరో హాలీవుడ్‌ మూవీలో దీపిక..?

దీపికా పదుకొనె ప్రస్తుతం బాలీవుడ్ టాప్ హీరోయిన్. పెద్ద పెద్ద సినిమాలన్నీ ఆమె కోసం క్యూ కడతాయి. అయితే రాశి కాదు వాసి చూడాలన్నట్టు…ఎడా పెడా సినిమాలు చేసేయకుండా, తక్కువ చేసినా మంచివే చేయాలనే నియమం పెట్టుకుంది దీపిక. ప్రస్తుతం ‘చప్పాక్’లో యాసిడ్ అటాక్ విక్టిమ్ గా నటిస్తూనే… ‘83’లో కపిల్‌ దేవ్ భార్య రోమీ పాత్రను పోషిస్తోంది. అయితే రీసెంట్ గా ఒక హాలీవుడ్‌ మూవీకి కూడా కమిటైనట్లు తెలుస్తోంది.

ఆల్రెడీ రెండేళ్ల క్రితం ‘రిటర్న్ ఆఫ్‌ జేండర్ కేజ్’ అనే హాలీవుడ్‌ మూవీలో నటించింది. ఆ తర్వాత కూడా కొన్ని ఇంగ్లి ష్ సినిమా అవకాశాలు వెతుక్కుంటూ వచ్చినా ఆమె యాక్సెప్ట్ చేయలేదు. కానీ ఇప్పుడు ఓకే అన్నదని సమాచారం. అది కూడా గత చిత్రాన్ని డైరెక్ట్ చేసిన డీజే కరూసో మూవీయేనట. నిజానికి పోయినేడు వీళ్లిద్దరి కాంబోలో మూవీ గురిం చి సోషల్ మీడియాలో ఎవరో ప్రశ్నిస్తే .. స్వయంగా కరూసోనే స్పందించాడు.

స్క్రిప్ట్ వర్క్ జరుగుతోందని, అది పూర్తవ్వగానే ప్రాజెక్ట్ సెట్స్​కి వెళ్తుందని చెప్ పాడు. అది కాస్తా ఇప్పటికి కంప్లీట్ అయ్యిందట. ప్రస్తుతం చేస్తున్న మూవీస్‌ పూర్తయ్యాక దీపి క ఆ సినిమా పనిలో పడుతుందని అంటున్నా రు. అదే నిజమైతే దీపి కకి హాలీవుడ్ లోనూ తన ముద్ర వేసే ఆలోచన ఉన్నట్టే. చూద్దాం ..ఆమె కూడా ప్రియాంకలా ఇంటర్నేషనల్ స్టార్ అయిపోతుందేమో.

Latest Updates