వైరల్: రాహుల్ గాంధీ ఎప్పటికైనా ప్రధాని అవుతారు

ముంబై: డ్రగ్స్ కేసులో బాలీవుడ్ టాప్ హీరోయిన్ దీపికా పదుకొణే విచారణను ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. ఈ తరుణంలో కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీని ప్రశంసిస్తూ దీపిక గతంలో చేసిన కామెంట్స్ ఇప్పుడు నెట్‌‌లో వైరల్ అవుతున్నాయి. ఓ టీవీ ఛానెల్‌‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో దీపిక మాట్లాడుతూ.. తనకు ఇష్టమైన నేతల్లో రాహుల్ గాంధీ ముందుంటారని, ఎప్పటికైనా ఆయన దేశ ప్రధాని అవుతారని చెప్పారు. ‘దేశం కోసం రాహుల్ గాంధీజీ చేస్తున్న పనులు ఆయనను మంచి ఉదాహరణలా నిలుపుతున్నాయి. ఏదో ఒక రోజు ఆయన ప్రధాన మంత్రి అవుతారు. రాహుల్ యువతతో బాగా కనెక్ట్ అవుతారు. ఆయన ఆలోచనలు సంప్రదాయబద్ధంగా ఉంటాయి. అదే సమయంలో భవిష్యత్‌‌ను నిర్దేశించేలా ఉంటాయి’ అని దీపిక పేర్కొన్నారు. ఈ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

Latest Updates