బ్రేకింగ్: డ్రగ్స్ కేసులో నలుగురు టాప్ హీరోయిన్స్‌‌కు సమన్లు

ముంబై: బాలీవుడ్ యంగ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌‌పుత్ కేసులో డ్రగ్ కోణం కీలకంగా మారింది. ఈ విషయంలో ఇన్వెస్టిగేషన్ చేస్తున్న నార్కొటిక్స్ కంట్రోల్ బ్యూరో తాజాగా నలుగురు హీరోయిన్స్‌‌కు సమన్లు జారీ చేసింది. బీ-టౌన్ టాప్ హీరోయిన్స్ దీపికా పడుకొనే, శ్రద్ధా కపూర్, సారా అలీఖాన్‌‌తోపాటు రకుల్ ప్రీత్ సింగ్‌‌కు ఎన్సీబీ సమన్లు ఇచ్చింది. మూడ్రోజుల్లోపు వారిని విచారణకు హాజరవ్వాల్సిందిగా పేర్కొంది. ఫిల్మ్ ఇండస్ట్రీకి డ్రగ్స్ లింకుల విషయంలో ఎన్సీబీ సమన్లు జారీ చేసిన హై ప్రొఫైల్ వ్యక్తులు వీళ్లే కావడం గమనార్హం. ఈ కేసు విచారణలో దీపిక మేనేజర్ కరిష్మా ప్రకాశ్‌‌ను కూడా ప్రశ్నించనున్నట్లు తెలుస్తోంది. డ్రగ్స్ సేకరణలో రియా చక్రవర్తి మొబైల్ ఫోన్‌‌కు వచ్చిన వాట్సాప్ మెసేజ్‌‌లతో ఉన్న సంబంధం గురించి కరిష్మా ప్రకాశ్‌‌ను క్వశ్చన్ చేస్తారని సమాచారం.

Latest Updates