ఆర్చరీలో దీపిక కుమారికి గోల్డ్, అంకితకు రజతం

ఆసియా ఛాంపియన్‌షిప్‌లో ఇండియన్ ఆర్చరీ ప్లేయర్స్ దీపిక, అంకితలు మెడల్స్ దక్కించుకున్నారు. వ్యక్తిగత రికర్వు ఈవెంట్‌లో స్వర్ణం, రజతం పతకాలను కైవసం చేసుకున్నారు. గురువారం బ్యాంకాక్ లో జరిగిన ఫైనల్ పోరులో దీపికా కుమారి 6-0 తేడాతో అంకితకు పై  విక్టరీ సాధించి  గోల్డ్ మెడల్ ను గెలుచుకుంది. రన్నరప్‌గా నిలిచిన అంకితకు రజతం దక్కింది. ఆసియా ఛాంపియన్‌షిప్‌ సెమీస్‌కు చేరడంతోనే  దీపిక, అంకితలు ఒలంపిక్స్‌ వ్యక్తిగత రికర్వు ఈవెంట్‌కు అర్హత పొందారు. సెమీస్‌లో వియత్నంకు చెందిన గుయెత్‌ డు తి అన్‌ను దీపిక, భూటాన్‌కు చెందిన కర్మను అంకిత ఓడించారు.

Latest Updates