సెక్యూరిటీ రివ్యూ.. లడఖ్‌కు వెళ్లనున్న రాజ్‌నాథ్

న్యూఢిల్లీ: డిఫెన్స్ మినిస్టర్ రాజ్‌నాథ్ సింగ్ శుక్రవారం లడఖ్‌ను పర్యటించనున్నారు. తూర్పు లడఖ్‌లో ఇండో–చైనా మధ్య ఘర్షణలు, ఉద్రిక్త వాతావరణం నెలకొనడం, ఇరు దళాలు వెనక్కి తగ్గిన నేపథ్యంలో సెక్యూరిటీ రివ్యూ కోసం రాజ్‌నాథ్ లడఖ్‌ వెళ్తున్నారని ఇద్దరు అధికారులు తెలిపారు. శనివారం రాజ్‌నాథ్ జమ్మూ కాశ్మీర్‌‌లను విజిట్ చేస్తారని వారు చెప్పారు. ఈ టూర్‌‌లో రాజ్‌నాథ్‌తోపాటు ఆర్మీ చీఫ్​ జనరల్ మనోజ్ ముకుంద్ నరవాణే కూడా వెళ్లనున్నట్లు అఫీషియల్స్ పేర్కొన్నారు. ప్రధాని మోడీ ఈ నెల 3న లడఖ్ విజిట్‌కు వెళ్లిన సంగతి తెలిసిందే.

Latest Updates