చైనాకు రాజ్‌నా‌థ్ వార్నింగ్.. ఎంతవరకైనా వెళ్తాం

మా భూమిని కాపాడుకునేందుకు ఎంతవరకైనా వెళ్తాం
స్టేటస్ కో ఒప్పందాన్నిమార్చే ప్రయత్నం చేయొద్దని సూచన

న్యూఢిల్లీ: చైనాకు గట్టి వార్నింగ్​ ఇచ్చారు రక్షణ మంత్రి రాజ్​నాథ్​ సింగ్​. ఎల్​ఏసీని గౌరవించి తీరాల్సిందేనని, బార్డర్​పై చేసుకున్న స్టేటస్​ కో ఒప్పందాన్ని మార్చే ప్రయత్నాలు చేయొద్దని హెచ్చరించారు. శుక్రవారం రాత్రి షాంఘై కోఆపరేషన్​ ఆర్గనైజేషన్ దేశాల డిఫెన్స్​ మినిస్టర్ల సమావేశం తర్వాత చైనా డిఫెన్స్​ మినిస్టర్​ వెయ్​ ఫెంగ్​తో మాస్కోలో రాజ్​నాథ్​ భేటీ అయ్యారు. ఎల్​ఏసీ వద్ద చైనా ఆక్రమణలు, సరిహద్దు మార్చే కుయుక్తులపై రాజ్​నాథ్​ తీవ్రంగా స్పందించినట్టు శనివారం అధికారులు వెల్లడించారు. దేశసావర్నిటీ, ఇంటిగ్రిటీ కాపాడుకునేందుకు ఎంతవరకైనా వెళ్తామని వెయ్​ఫెంగ్​ను హెచ్చరించినట్టు చెప్పారు. బార్డర్​లో ఉద్రిక్తతలను తొలగించేందుకు తగ్గి ఉండాలని సూచించారు. బార్డర్​ వెంట బలగాలను మోహరిస్తూ టెన్షన్లు పెంచొద్దని వార్నింగ్​ ఇచ్చారు. పరిస్థితి మరింత సీరియస్​ అయ్యేలా ఎలాంటి చర్యలు తీసుకోవద్దని చెప్పారు. రెండు దేశాల సంబంధాలపై దెబ్బ పడేలా బార్డర్​ స్టేటస్​ కోను మార్చే ప్రయత్నం చేయొద్దని సూచించారు. చర్చలతోనే బార్డర్​ సమస్యలను పరిష్కరించుకోవాలని వెయ్​ ఫెంగ్​కు రాజ్​నాథ్​ సూచించారు. మిలటరీ, డిప్లొమాటిక్​ స్థాయిల్లో చర్చలు జరుపుతూనే బార్డర్​లో ప్రశాంత వాతావరణం ఏర్పడేందుకు కృషి చేయాలన్నారు. బార్డర్​ విషయంలో మన బలగాలు బాధ్యతాయుతంగానే ఉన్నాయని వివరించారు. అవసరమైతే దూకుడుగా వెళ్లేందుకూ వెనకాడబోమని చెప్పారు.

For More News..

దొంగతనం చేసిండని కట్టేసి తమ సరదా తీర్చుకున్రు

బార్డర్లో ముగ్గురు చైనా వాళ్లను కాపాడిన ఇండియన్ ఆర్మీ

కరోనాపై టెన్షన్ వద్దు.. కంట్రోల్​లోనే ఉంది

Latest Updates