మన నేలపై కన్నేసిన వారికి ఇదో హెచ్చరిక

మన మిలిటరీలో కొత్తశకం: రాజ్‌నాథ్ సింగ్

న్యూఢిల్లీ: ఐదు రాఫెల్ ఫైటర్ జెట్స్ చేరికతో ఇండియన్ ఎయిర్ ఫోర్స్(ఐఏ ఎఫ్) బలం మరింత పెరిగిందని, ఎలాంటి పరిస్థితులు ఎదురైనా ఎదుర్కొనేందుకు ఇవి దోహదపడతాయని రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ అన్నారు. రాఫెల్ జెట్ల వల్ల ఐఏఎఫ్ కు బాట్ కెపాసిటీ పెరుగుతుందని చెప్పారు. ఇండియా భూభాగంపై కన్నేసిన వారికి మన కొత్త సత్తా చూస్తే భయం కలగడం ఖాయమని ఆయన హెచ్చరించారు. లడాఖ్‌లో మన భూభాగంలోకి చొచ్చుకొచ్చిన చైనాను ఉద్దేశించి రాజ్ నాథ్ ఈ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. రాఫెల్ జెట్స్ ల్యాండ్ అవ్వడంతో ఇండియన్ మిలిటరీ చరిత్రలోనే కొత్త శకం మొదలైందని చెప్పారు. ఈ మేరకు బుధవారం ఆయన ట్విట్టర్లో వరుస ట్వీట్లు చేశారు. ఐఏఎఫ్ అవసరాలను గుర్తించే రాఫెల్ జెట్స్‌ను కొనుగోలు చేశామని, వీటికి సంబంధించి వచ్చిన ఆరోపణలు నిజంకాదని ఇప్పటికే నిరూపించామని కాంగ్రెస్ పార్టీని ఉద్దేశించి ఆయన కామెంట్ చేశారు. ఫ్రాన్స్ నుంచి రాఫెల్ జెట్స్‌ను తీసుకొచ్చిన ఐఏఎఫ్ న ఆయన అభినందించారు. ప్రధాని మోడీ తీసుకున్న సరైన నిర్ణయం కారణంగానే ఈ ఎగ్రిమెంట్ పూర్తయ్యిందని, ఆయన ధైర్యానికి , నిబద్ధతకు కృతజ్ఞతలు తెలిపారు. ఫ్రాన్స్ ప్రభుత్వానికి, దస్సాల్ట్ ఏవియేషన్‌కు కూడా ధన్యవాదాలు చెప్పారు.

For More News..

కొత్త సెక్రటేరియట్ పై సీఎం కేసీఆర్ సమీక్ష

Latest Updates