మూడు విడతల్లో డిగ్రీ అడ్మిషన్లు

హైదరాబాద్, వెలుగు: రానున్న విద్యాసంవత్సరంలో డిగ్రీ ఆన్​లైన్​ అడ్మిషన్లు మూడు విడతల్లో నిర్వహించాలని ఉన్నత విద్యామండలి నిర్ణయించింది. గతంలో ఐదారు విడతల్లో అడ్మిషన్స్ ప్రక్రియ నిర్వహించిన విద్యా మండలి పలు సమస్యలు ఎదురవడంతో శుక్రవారం జేఎన్​ఏఎఫ్ఏ వర్సిటీలో జరిగిన దోస్త్ కో-ఆర్డినేటర్ల సమావేశంలో ఈ నిర్ణయం తీసుకుంది. ఈ సందర్భంగా గతంలో విద్యార్థులు అప్లై చేసుకున్నప్పుడు ఎదురైన సమస్యలపై హయ్యర్ ఎడ్యుకేషన్ కమిషనర్ నవీన్ మిట్టల్, దోస్త్ కన్వీనర్ లింబాద్రి వారిని అడిగి తెలుసుకున్నారు. ఈ సంవత్సరం మీ-సేవ ద్వారా 64 శాతం మంది విద్యార్థులు అప్లై చేసుకుంటే, హెల్ప్​లైన్​ సెంటర్ల ద్వారా కేవలం ఐదుశాతం మందే అప్లై చేసుకున్నారని లింబాద్రి తెలిపారు. రాష్ట్రంలో కొత్తగా 60 హెల్ప్ లైన్​ సెంటర్లను ఏర్పాటు చేస్తున్నామని, వాటి ద్వారా దరఖాస్తు చేసుకునేలా స్టూడెంట్స్​కు అవగాహన కల్పిస్తామని అన్నారు. ఆధార్ లింకేజీ కోసం బయోమెట్రిక్‌తో పాటు ఐరిస్ మిషన్లనూ అన్ని జిల్లా కేంద్రాల్లో ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు.  అప్లై చేసుకున్నప్పటి నుంచి స్టూడెంట్లకు సమాచారాన్ని మొబైల్‌​కు మెసేజ్ ఇవ్వడంతో పాటు వాట్సాప్‌కు, మెయిల్​కూ వివరాలు సెండ్ చేస్తామన్నారు. గతంలో ఎన్ని విడతల్లో అప్లై చేసినా.. ఒకే ఓటీపీ ఉండేదనీ, కానీ వచ్చే విద్యాసంవత్సరం అప్లై చేసిన ప్రతిసారి కొత్త ఓటీపీ కేటాయిస్తామన్నారు. కాలేజీల్లోనే అప్లికేషన్స్​లో ఎడిట్‌కు అవకాశం కల్పిస్తామన్నారు.

For More News..

ఎడ్యుకేషన్‌‌కు ఫుల్లు పైసల్‌‌

కరోనా​ షాక్..​ మార్కెట్​ షేక్

Latest Updates