పిడుగు పడి యువతి మృతి

నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మండలం సింగోటం గ్రామంలో ఘోరం జరిగింది.  పిడుగు పడి ఓ డిగ్రీ చదివే యువతి సహా రెండు పశువులు మృతి చెందాయి. గ్రామస్తుల తెలిపిన వివరాల ప్రకారం.. వనపర్తిలో  డిగ్రీ చదువుతున్న ఆ యువతి దసరా సెలవులని ఇంటికి వచ్చింది. బుధవారం ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడుతుండటంతో ఇంటి ఆవరణలో తడుస్తున్న ఎద్దులను కొట్టంలో కట్టెయ్యడానికి వెళ్లింది. అదే సమయంలో పిడుగు పడడంతో ఆమె తోపాటు ఆ రెండు ఎద్దులు కూడా మరణించాయి. సెలవుల కోసం ఇంటికొచ్చిన కూతురు ఇలా పిడుగు పాటుకు మరణించడంతో ఆమె  తల్లిదండ్రులు బోరున విలపిస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు.

Latest Updates