స్టూడెంట్స్ మధ్య గ్యాంగ్ వార్.. ఒకరు మృతి

తిరుపతిలోని చదలవాడ డిగ్రీ కాలేజీలో దారుణం జరిగింది. డిగ్రీ ఫైనల్ ఇయర్ చేస్తున్న ద్వారకనాథ్(20)  అనే విద్యార్ధిని అదే కాలేజికి చెందిన అతని సహచర విద్యార్ధులు కత్తితో పొడిచి దారుణ హత్యకు పాల్పడ్డారు. కడప జిల్లా రైల్వేకోడూరు కు చెందిన 20 ఏళ్ల ద్వారకనాథ్ ఏడాదిన్నర క్రితం చదువుకునేందుకు తిరుపతికి వచ్చి శెట్టిపల్లిలో ఓ గదిని అద్దెకు తీసుకొని ఉంటున్నాడు.  అతని తల్లిదండ్రులు కువైట్ లో ఉంటున్నారు.  కాలేజిలో  మొదలైన గొడవల కారణంగా ద్వారకనాథ్ శెట్టిపల్లి రైల్వే గేటు వద్దకు పిలిపించి, బీరు బాటిల్ లతో దాడి చేసి కత్తులతో మెడపై పొడిచి చంపారు. ఈ ఘటనపై సమాచారమందుకున్న అలిపిరి పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పరిశీలించారు. విద్యార్థుల మధ్య గొడవలే హత్యకు కారణమని వారు భావిస్తున్నారు. హత్యకు పాల్పడ్డ యువకుల కోసం పోలీసులు గాలిస్తున్నారు.

Latest Updates