
సికింద్రాబాద్, వెలుగు: యువకుడి వేధింపులు తట్టుకోలేక ఓ డిగ్రీ విద్యార్థిని సూసైడ్ చేసుకుంది. బేగంపేట ఇన్స్పెక్టర్ రామయ్య వివరాల ప్రకారం.. రసూల్పురా ఇందిరమ్మ నగర్కు చెందిన గుంజరి విఠల్కూతురు స్రవంతి(19) మారేడుపల్లిలోని కస్తూర్బా కాలేజీలో డిగ్రీ రెండో సంవత్సరం చదువుతోంది. స్రవంతి ఇంటి పక్కనే నివాసముండే సురేశ్ కొంతకాలం డబ్బులు తీసుకుని ఇవ్వడం లేదు. తిరిగి పదే పదే డబ్బులు అడుగుతూ వేధింపులకు గురి చేస్తున్నాడు. దీంతో మనోవేదనకు గురైన స్రవంతి ఈ నెల11న ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకుని సూసైడ్ చేసుకుంది.
యువతి తల్లిదండ్రులు కూరగాయల వ్యాపారం నిర్వహిస్తుండగా.. తిరిగి ఇంటికి వచ్చే లోపు తలుపు గడియపెట్టి ఉంది. స్రవంతి ఎంతకీ తలుపు తీయకపోవడంతో తండ్రి విఠల్ బద్ధలు కొట్టి చూడగా.. స్రవంతి ఉరేసుకుని కనిపించింది. వెంటనే ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే ఆమె మృతి చెందినట్లు డాక్టర్లు తెలిపారు.
యువతి తండ్రి పోలీసులకు సమాచారం అందించాడు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు యువతి ఫోన్ ను పరిశీలించారు. చివరి కాల్ ఇంటి పక్కనే నివాసముండే సురేశ్ మాట్లాడినట్లు గుర్తించారు. తన కూతురు చావుకు సురేశ్ వేధింపులే కారణమని తండ్రి విఠల్ ఫిర్యాదుతో బేగంపేట పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.