పరీక్ష సెంటర్ కు ఆలస్యం..నలుగురు టీచర్లు సస్పెండ్

ఆంధ్రప్రదేశ్ : సచివాల ఉద్యోగాల రాత పరీక్షకు అరగంట ఆలస్యంగా వచ్చిన నలుగురు ఇన్విజిలేషన్ టీచర్లు సస్పెన్షన్ కు గురయ్యారు. మంగళవారం కర్నూలులో జరిగిన సచివాలయ ఉద్యోగాల రాత పరీక్షలో.. ఉదయం 7 గంటలకు పరీక్షా కేంద్రానికి చేరుకుని.. చీఫ్ సూపరింటెడెంట్ కు రిపోర్టు చేయాల్సి ఉండగా.. నలుగురు టీచర్లు అరగంట ఆలస్యంగా వచ్చారు.

ఈ విషయాన్ని సీసీ కెమెరాలో పర్యవేక్షించిన కలెక్టర్ వెంటనే సస్పెన్షన్ ఉత్తర్వులు జారీ చేశారు. అభ్యర్థులు ఒక్క నిమిషం ఆలస్యంగా వచ్చినా పరీక్షలకు నో ఎంట్రీ అనే రూల్స్ అమలు చేస్తున్నప్పుడు.. ఇన్విజిలేషన్ డ్యూటీ చేస్తున్న వారు కూడా సమయ పాలన పాటించాలని తెలిపారు కలెక్టర్. ఈ క్రమంలోనే నలుగురు టీచర్లపై కలెక్టర్ సస్పెన్షన్ వేటు వేశారు.

Latest Updates