ట్రీట్మెంట్ పేరుతో ఆస్పత్రుల చుట్టూ తిప్పించి..7నెలల పసికందు ప్రాణం తీసిన డాక్టర్లు

బ్రెయిన్ సంబంధిత సమస్యతో బాధపడుతున్న ఏడునెలల చిన్నారి ప్రాణాలు కోల్పోయింది. అందుకు కారణం పలు ఆస్పత్రులకు చెందిన డాక్టర్లేనని తల్లిదండ్రులు చెబుతున్నారు. ట్రీట్మెంట్ పేరుతో ఆస్పత్రుల చుట్టూ తిప్పారని చివరికి పొత్తిళ్ల పాపాయి తమను విడిచిపెట్టి వెళ్లిందంటూ కన్నీటి పర్యంతమవుతున్నారు.

ఢిల్లీకి చెందిన ఏడునెలల చిన్నారికి ఆగస్ట్ 3న అనారోగ్య సమస్యలు తలెత్తాయి. ఫివర్, స్పృహ కోల్పోవడంతో ఆందోళనకు గురైన చిన్నారి తల్లిదండ్రులు అత్యవసర చికిత్స కోసం బాబు జగజ్జీవన్ రాయ్ ఆస్పత్రికి తరలించారు. పలు టెస్ట్ లు చేసిన డాక్టర్లు మెరుగైన వైద్యం కోసం డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ ఆస్పత్రికి తీసుకెళ్లాలని తల్లిదండ్రులకు సూచించారు. డాక్టర్ బాబా సాహెబ్ ఆస్పత్రికి తీసుకొని వెళ్లగా అక్కడా చిన్నారి బ్రెయిన్ కి అల్ట్రా సౌండ్ స్కానింగ్ చేసిన డాక్టర్లు రామ్ మనోహర్ లోహియా ఆస్పత్రికి తరలించారు.

ఇలా రామ్ మనోహర్ లోహియా, సప్ధర్ జంగ్, జీబీ పంత్ , కళావతి శరణ్, చాచా నెహ్రూ చికిత్సాల ఆస్పత్రుల చుట్టూ తిప్పారు. ఆస్పత్రికి తీసుకొని వెళ్లడం డాక్టర్లు ట్రీట్మెంట్ ఇవ్వకుండా మరో ఆస్పత్రికి రిఫర్ చేయడం. ఇలా అన్నీ ఆస్పత్రుల చుట్టూ తిరిగిన తరువాత మళ్లి తొలిసారి చిన్నారిని జాయిన్ చేయించిన బాబు జగజ్జీవన్ రాయ్ ఆస్పత్రికి తీసుకెళ్లి..పసికందుకు ట్రీట్మెంట్ చేయాలని తల్లిదండ్రులు.., డాక్టర్లను ప్రాదేయపడ్డారు. మూడురోజుల పాటు ఎటువంటి చికిత్స చేయకుండా వదిలేశారు. మూడురోజుల తరువాత పాప మృతి చెందింది.

దీంతో డాక్టర్ల కాఠిన్యంపై పసికందు తల్లిదండ్రులు హైకోర్ట్ ను ఆశ్రయించారు. విచారణ చేపట్టిన కోర్ట్ అన్నీ ఆస్పత్రులకు నోటీసులు జారీ చేసింది. చిన్నారి విషయంలో ఏం జరిగిందో కోర్ట్ కు వివరణ ఇవ్వాలంటూ ఆదేశించింది.

Latest Updates