ఢిల్లీ అసెంబ్లీ  ఎన్నికల పోలింగ్ షురూ

ఢిల్లీ అసెంబ్లీ  ఎన్నికల  పోలింగ్  మొదలైంది. పొద్దున 8 గంటల  నుంచి పెద్ద ఎత్తున  ఓటర్లు పోలింగ్  కేంద్రాలకు వచ్చారు. చలిగా ఉండడంతో  8 గంటల నుంచి  పోలింగ్  మొదలు పెట్టారు. అన్ని పోలింగ్ కేంద్రాల  దగ్గర  బందోబస్తు  నిర్వహిస్తున్నారు. మొదటి  గంటలోనే చాలా మంది  ప్రముఖులు  తమ ఓటు  హక్కు  వినియోగించుకున్నారు. తుగ్లక్ క్రిసెంట్ లోని ….NDMC  స్కూల్ లో  విదేశాంగ మంత్రి  జైశంకర్ ఓటు వేశారు. ఇక్కడే  సుప్రీం కోర్టు  న్యాయమూర్తి  జస్టిస్  భానుమతి  కూడా ఓటు వేశారు. అటు  బీజేపీ నేతలు  రాంమాధవ్,  కపిల్ మిశ్రా,  ప్రవేశ్  వర్మ ఓటు వేశారు. షహీన్ బాగ్ లోని  పోలింగ్ కేంద్రాల  దగ్గర ఉదయం  నుంచే  ఓటర్లు పెద్ద సంఖ్యలో  క్యూ కట్టారు. కేంద్రమంత్రి  హర్షవర్ధన్  కృష్ణానగర్ లో  ఓటు వేశారు. తన తల్లిని  వీల్ చైర్ లో  తీసుకొచ్చారు హర్షవర్ధన్.

Latest Updates