ఢిల్లీ బీజేపీ చీఫ్ మార్పు.. మనోజ్ తివారీ స్థానంలోకి ఆదేశ్ గుప్తా

భార‌తీయ జ‌నాతా పార్టీ (బీజేపీ) ఢిల్లీలో త‌మ పార్టీ అధ్య‌క్షుడిని మారుస్తూ నిర్ణ‌యం తీసుకుంది. దాదాపు మూడున్న‌రేళ్లుగా ఢిల్లీ బీజేపీ చీఫ్ గా ఉన్న మ‌నోజ్ తివారీ స్థానంలో సీనియ‌ర్ నేత ఆదేశ్ కుమార్ గుప్తాను నియ‌మించింది పార్టీ అధిష్ఠానం. గ‌తంలో న్యూఢిల్లీ మున్సిప‌ల్ కౌన్సిల్ మేయ‌ర్ గా ప‌ని చేసిన ఆదేశ్ ను ఢిల్లీ బీజేపీ చీఫ్ గా నియ‌మిస్తూ పార్టీ జాతీయ అధ‌క్షుడు జేపీ న‌డ్డా మంగ‌ళ‌వారం ప్ర‌క‌ట‌న విడుద‌ల చేశారు. ఈ నియామ‌కం త‌క్ష‌ణం అమ‌లులోకి వ‌స్తుంద‌ని తెలిపారు.

ట్వీట్ చేసిన మ‌నోజ్ తివారీ..

ఢిల్లీ బీజేపీ చీఫ్ గా ఉన్న మ‌నోజ్ తివారీ నూత‌న అధ్య‌క్షుడి నియామ‌కంపై ట్వీట్ చేశారు. 3.6 సంవ‌త్స‌రాలుగా తాను ఢిల్లీ బీజేపీ అధ్య‌క్షుడిగా ఉన్న స‌మ‌యంలో త‌న‌కు స‌హ‌క‌రించిన ఢిల్లీ ప్ర‌జ‌లు, అధికారుల‌కు థ్యాంక్స్ చెప్పారు. వారంద‌రి ప్రేమ‌, ఆద‌ర‌ణ‌కు రుణ‌ప‌డి ఉంటాన‌ని అన్నారు. త‌న‌కు తెలిసో తెలియ‌కుండానో ఎవైనా త‌ప్పులు జ‌రిగి ఉంటే క్ష‌మించాల‌న్నారు. కొత్త అధ్య‌క్షుడిగా నియ‌మితులైన ఆదేశ్ గుప్తాకు కంగ్రాట్స్ చెప్పారు.

Latest Updates