
ఆమ్ఆద్మీ పార్టీపై ఢిల్లీ బీజేపీ రూ.500కోట్ల పరువునష్టం దావా వేసింది. ఢిల్లీ ఎన్నికల ప్రచారంలో దూకుడు మీదున్న అధికార ఆమ్ ఆద్మీ పార్టీ క్యాంపెయిన్ సాంగ్‌ను రిలీజ్ చేసింది. ఆ సాంగ్ లో భోజ్ పూరి సింగర్ మనోజ్ తివారి యాక్ట్ చేసిన సన్నివేశాలు ఉన్నాయి. ఆ సన్నివేశాల్లో ఉన్న ఆడియో ట్రాక్ ను మార్చి “ఆప్” తనకు అనుగుణంగా “లగేరహో కేజ్రీవాల్ ” అని అర్ధం వచ్చేలా సాంగ్ ను కంపోజ్ చేసింది.
అయితే ఆమ్ఆద్మీ తీరుపై ఢిల్లీబీజేపీ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. ఆప్ సాంగ్ ముఖ్య ఉద్దేశం తమ పార్టీ స్టార్ క్యాంపెయినర్ మనోజ్ తివారీని కించపరిచేలా ప్రచారం చేస్తున్నారని ఫిర్యాదులో పేర్కొంది.
ఆమ్ ఆద్మీ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ను ఉల్లంఘించి వీడియోను విడుదల చేసిందని, ఐటీ యాక్ట్ ప్రకారం తమ నేతను కించపరిచే ఉద్దేశంతోనే వీడియోను తయారు చేసినట్లు బీజేపీ ఆరోపించింది.
మరోవైపు బిజెపి అధ్యక్షుడు మనోజ్ తివారీ ఆప్ పై విరుచుకుపడ్డారు. ఎన్నికల ప్రచారం కోసం తన ఆల్బమ్ వీడియోలను ఉపయోగించుకునే హక్కు ఎవరిచ్చారని అన్నారు.