IPL: ఢిల్లీ ఖాతాలో రెండో గెలుపు

తమ ప్లాన్స్‌ ను పక్కాగా అమలు చేసిన ఢిల్లీ క్యాపిటల్స్‌ .. ఐపీఎల్‌ లో రెండో విజయాన్ని అందుకుంది..! యంగ్‌ క్రికెటర్‌ పృథ్వీ షా (43 బాల్స్‌ లో 64, 9 ఫోర్లు,1 సిక్స్‌ ) మెరుపులకు బౌలర్ల అండ తోడు కావడంతో.. బలమైన చెన్నై సూపర్‌ కింగ్స్‌ కు ఢిల్లీ అద్భుతంగా చెక్‌ పెట్టింది..! మరోవైపు రాజస్తాన్‌ చేతిలో బొక్కబోర్లా పడిన సీఎస్‌‌కే.. ఈ మ్యాచ్‌ లోనూ స్థాయికి తగ్గ పెర్ఫామెన్స్‌ చేయలేకపోయింది..! పెద్ద టార్గెట్‌‌ కాకపోయినా.. ఛేజింగ్‌ లో వికెట్లను కాపాడుకోవడంలో విఫలమైన ధోనీ బృందం.. రెండో ఓటమిని మూటగట్టుకుంది. ఆల్‌‌రౌండ్‌‌ షోతో అదరగొట్టిన ఢిల్లీ క్యాపిటల్స్‌‌.. ఐపీఎల్‌‌లో జోరు కొనసాగిస్తోంది . శుక్రవారం జరిగిన లీగ్‌‌ మ్యాచ్‌‌లో 44 రన్స్‌‌ తేడాతో చెన్నైపై గెలిచింది. టాస్‌‌ ఓడి బ్యాటింగ్‌‌కు దిగి న ఢిల్లీ 20 ఓవర్లలో 3 వికెట్లకు 175 రన్స్‌‌ చేసింది . పృథ్వీ షాకు తోడుగా రిషబ్‌‌ పంత్‌‌ (25 బాల్స్‌‌లో 37 నాటౌట్‌‌, 5 ఫోర్లు), ధవన్‌‌ (27 బాల్స్‌‌లో 35, 3 ఫోర్లు, 1 సిక్స్‌‌) రాణించారు. తర్వాత 20 ఓవర్లలో 7 వికెట్లకు 131 రన్స్ కే పరిమితమైంది . డుప్లెసిస్‌‌ (35 బాల్స్‌‌లో 43,4 ఫోర్లు) టాప్‌ స్కోరర్‌‌. కేదార్‌‌ జాదవ్‌‌ (21 బాల్స్‌ లో26, 3 ఫోర్లు) ఓ మాదిరిగా ఆడాడు. రబాడ 3 వికెట్లతో చెన్నై పరాజయాన్ని శాసించాడు. పృథ్వీకి‘మ్యాన్‌‌ ఆఫ్‌‌ ద మ్యాచ్‌‌’ అవార్డు లభించింది .

పృథ్వీ మెరు పులు..

తొలి మ్యాచ్‌‌లో అనవసరంగా ధవన్‌‌ ను రనౌట్‌‌ చేసిన పృథ్వీ ఈసారి కంప్లీట్‌‌ డిఫరెంట్‌‌గా ఆడాడు. ఇన్నింగ్స్‌‌ రెండో బాల్‌‌కే ఇన్‌‌సైడ్‌‌ ఎడ్జ్‌‌ అయినా ఎవరూ పట్టించుకోలేదు. ఆ తర్వాతి నుంచి చెన్నై బౌలర్లపై పూర్తి ఆధిపత్యం చూపెడుతూ బౌండ్రీలతో చెలరేగిపోయాడు. ఫస్ట్‌‌ ఓవర్‌‌లో రెండు, నాలుగో ఓవర్‌‌లో మరో రెండు ఫోర్లు కొట్టాడు.రెండో ఎండ్‌‌లో ధవన్‌‌ సింగి ల్స్‌‌కే పరిమితమైనా..రన్‌‌రేట్‌‌ తగ్గకుండా చూశాడు. దీంతో పవర్‌ ‌ప్లేలో ఢిల్లీ 36/0 స్కోరు చేసింది . ఏడో ఓవర్‌‌లో షా మరో రెండు ఫోర్లు బాది తే.. తర్వాతి ఓవర్లో ధవన్‌‌ రేస్‌‌లోకి వచ్చాడు. జడేజా వేసిన ఎనిమిదో ఓవర్‌‌లో 6, 4తో 13 రన్స్‌‌ రాబట్టాడు. ఆ వెంటనే షా మరో రెండు ఫోర్లు కొట్టి 35 బాల్స్ ‌లో హాఫ్‌‌ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. 10వ ఓవర్‌‌లో మరో ఫోర్‌‌,సిక్స్‌‌ బాదడంతో ఢిల్లీ వికెట్‌‌ పడకుండా 88 రన్స్‌‌ చేసింది . 11వ ఓవర్‌‌లో ధవన్‌‌ను వికెట్ల ముందు దొరికించుకున్న చావ్లా (2/33).. చెన్నైకి తొలి బ్రేక్‌‌ ఇచ్చాడు. దీంతో తొలి వికెట్‌‌కు 94 రన్స్‌‌ పార్ట్‌ నర్ ర్‌‌షిప్‌ బ్రేక్‌‌ అయ్యింది . ఇన్నింగ్స్ ‌లో వేగం తగ్గకుండా రిషబ్‌‌ను బ్యాటింగ్‌‌ ఆర్డర్ లో ముందుకు తీసుకురాగా.. 13వ ఓవర్‌‌లో ఢిల్లీ రెండో వికెట్‌‌ కోల్పోయింది . చావ్లా బాల్‌‌ను క్రీజు వదిలిఆడిన షా స్టం పౌట్‌‌ అయ్యాడు. అప్పటికీ ఢిల్లీ స్కోరు 103/2.వరుస విరామాల్లో రెండు వికెట్లు పడటంతో సీఎస్‌‌కే మళ్లీ రేస్‌‌లోకి వచ్చింది .ఎదురుగా రిషబ్‌‌, శ్రేయస్‌‌ (26) ఉన్నా.. స్పిన్నర్లు మరింత పట్టు బిగించడంతో 13, 14, 15 ఓవర్లలో కేవలం 22 రన్స్‌‌ మాత్రమే వచ్చాయి. అయితే 16వ ఓవర్‌‌లో 10 రన్స్‌‌ రాగా, ఆ వెంటనే శ్రేయస్‌‌ ఓఫోర్‌‌తో మరో 12 రన్స్‌‌ రాబట్టాడు. కానీ హాజిల్‌‌వుడ్‌‌ వేసిన 18వ ఓవర్‌‌లో పంత్‌‌ చూడముచ్చటైన రెండు కవర్‌‌ డ్రైవ్స్‌‌ కొట్టడంతో 11 రన్స్‌‌ వచ్చాయి.ఇక భారీ షాట్లకు ప్రయత్నిస్తు న్న శ్రేయస్‌‌ను 19వ ఓవర్‌‌లో కరన్‌‌ బోల్తా కొట్టిం చడంతో మూడోవికెట్‌‌కు 58 రన్స్‌‌ పార్ట్ ‌నర్‌‌షిప్‌ బ్రేక్‌‌ అయ్యింది .లాస్ట్‌‌ ఓవర్‌‌లో 14 రన్స్‌‌ రావడంతో ఢిల్లీ పోటీ ఇచ్చేస్కోరును సాధించింది .

డుప్లెసిస్‌‌ ఓకే..

భారీ టార్గెట్‌‌ కాకపోవడంతో దానిని కాపాడుకునేందుకు ఢిల్లీ బౌలర్లు బాగా శ్రమించారు.ఆరంభం నుంచే పక్కా ప్లాన్‌‌ ప్రకారం బంతులువేస్తూ సీఎస్‌‌కే ఓపెనర్లను కట్టడి చేశారు. దీంతో క్రీజులో ఇబ్బంది గా కదిలి న విజయ్‌ (10), వాటన్స్‌‌ (14) ఎక్కువసేపు వికెట్‌‌ కాపాడుకోలేక పోయారు. మూడో ఓవర్‌‌లో క్యాచ్‌‌ డ్రాప్‌ నుంచిగట్టెక్కిన వాట్సన్‌‌.. నాలుగో ఓవర్‌‌లో 4, 6తో రెచ్చిపోయాడు. కానీ తర్వాతి ఓవర్‌‌లోనే అక్షర్ (1/18) టర్నింగ్‌‌ను అర్థం చేసుకోలేక వికెట్‌‌ ఇచ్చుకున్నాడు. 9 బాల్స్‌‌ తర్వాత విజయ్‌ కూడా పెవిలియన్‌‌ చేరడంతో చెన్నై పవర్‌‌ప్లే ముగిసేసరికి 34 రన్స్ ‌కే2 వికెట్లు కోల్పోయింది . మిడిల్‌‌ ఓవర్స్ ‌లో రన్స్ ‌ను కట్టడి చేసిన స్పిన్నర్లు మిశ్రా, పటేల్‌‌… డుప్లెసిస్‌‌, రుతురాజ్‌‌ (5)ను ఒత్తి డిలోకి నెట్టారు. దీంతో 7నుంచి 10 ఓవర్లలో 11 రన్సే చేసి చెన్నై వికెట్‌‌ చేజార్చుకుంది . ఫలితంగా చెన్నై ఫస్ట్‌‌ టెన్‌‌లో 47/3 స్కోరుతో వెనుకబడిపోయింది . అయితే11వ ఓవర్‌‌ నుంచి చెన్నై కాస్త గేర్‌‌ మార్చినట్లు కనిపించింది . బలమైన షాట్లు కనెక్ట్‌‌ కాకపోయినా..డుప్లెసిస్ , కేదార్ వికెట్ల మధ్య వేగంగా పరుగెత్తుతూ సింగిల్స్‌‌, డబుల్స్‌‌ తీశారు. మధ్యలో డుప్లె సిస్‌‌ అడపాదడపా ఫోర్లు బాదాడు. ఓవరాల్‌‌గా ఐదు ఓవర్లలో 48 రన్స్‌‌ రావడంతో 15 ఓవర్లలో సీఎస్‌‌కే స్కోరు 95/3కి చేరింది . లాస్ట్‌‌ 5 ఓవర్లలో 81 రన్స్‌‌ చేయాల్సి న దశలో కేదార్‌‌ను.. నోర్జ్​ ఔట్‌‌ చేయడంతో స్కోరు 98/4గా మారింది . నాలుగో వికెట్‌‌కు 54 రన్స్‌‌ భాగస్వామ్యం ముగిసింది

ధోనీ వల్ల కాలేదు..

26 బాల్స్‌‌లో 78 రన్స్‌ చేయాల్సిన దశలో క్రీజు లోకి వచ్చిన సూపర్‌ ‌ఫినిషర్‌‌ధోనీ (15) కూడా టార్గెట్‌‌ ఛేజ్‌ ‌చేసే ఆట ఆడలేకపోయాడు. పిచ్‌‌ మందగించడం, మంచు ప్రభావం వల్ల బాల్‌‌ అనుకున్నంతగా బ్యాట్‌‌పైకి రాలేదు. దీంతో భారీ షాట్లు కొట్టలే కపోయాడు. 17వ ఓవర్‌‌లో కష్టమ్మీద మహీ రెండు ఫోర్లు బాదినా.. డుప్లె సిస్‌‌ ఆ ప్రయత్నంలో విఫలమయ్యాడు. ఈ క్రమంలో రబాడ వేసిన 18వ ఓవర్‌ ‌రెండో బాల్‌‌కు కీపర్‌‌కు క్యాచ్‌ ‌ఇచ్చి వెనుదిరిగాడు. దీంతో విజయ సమీకరణం 17 బాల్స్‌‌లో 63 రన్స్‌ గా మారింది. జడేజా (12) వచ్చిరావడంతోనే ఓ ఫోర్‌‌ కొట్టినా చేయాల్సిన రన్‌‌రేట్‌‌ భారీగా పెరిగింది. లాస్ట్‌‌ రెండు ఓవర్లలో 55 రన్స్ ‌కావాల్సిన దశలో 19వ ఓవర్‌‌లో 6 రన్సే వచ్చాయి. ఆఖరి ఓవర్‌‌లో ధోనీ ఔట్‌ ‌కావడంతో చెన్నై  విజయానికి చాలా దూరంలో నిలిచిపోయింది.

Latest Updates