టాప్ ప్లేస్ కి ఢిల్లీ..రాజస్థాన్ పై విక్టరీ

అజింక్యా రహానె అదరగొడితేనేమి.. అద్భుత సెంచరీతో రాజస్థాన్కు భారీ స్కోరు అందిస్తేనేమి..! గెలవాలని ఢిల్లీ.. గెలిపించాలని రిషబ్‌‌‌‌ పంత్డిసైడయ్యాక అజింక్యా పోరాటం నిష్ఫలమైంది..! సీజన్లో అద్భుత ఆటతో చెలరేగుతున్న ఢిల్లీ ఖాతాలో మరో విజయం చేరింది. శిఖర్ధవన్ , పృథ్వీషా మెరుపు ఆరంభం అందించగా.. చివర్లో పంత్చిరుతలా చెలరేగడంతో 192 రన్స్టార్గెట్‌‌‌‌ను ఊదేసిన ఢిల్లీ సీజన్లో ఏడో విక్టరీతోపట్టికలో టాప్ప్లేస్కు దూసుకెళ్లింది

 ఢిల్లీ క్యాపిటల్స్‌ టాప్‌ క్లాస్‌ ఆటతో అదరగొట్టింది.రిషబ్‌ పంత్‌ (36 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్సర్లతో 78నాటౌట్‌ ) ధనాధన్‌‌‌‌ బ్యాటింగ్‌ తో చెలరేగడంతో రాజస్థాన్‌‌‌‌ రాయల్స్‌ తో సోమవారం జరిగిన మ్యాచ్‌ లో ఢిల్లీ ఆరు వికెట్ల తేడాతో గెలిచింది.రహానె సెంచరీ, స్మిత్‌హాఫ్‌ సెంచరీ రాణించి ప్రత్యర్థి ముందు పెద్ద టార్గెట్‌ ఉంచినా.. పేలవ బౌలింగ్‌ తో రాయల్స్‌ దాన్ని కాపాడుకోలేకపోయింది. ఏడో ఓటమితో ప్లే ఆఫ్‌ ఆశలను మరింత సంక్షిష్టం చేసుకుంది. సోమవారం ఇక్కడ జరిగిన మ్యాచ్‌ లో రహానె (63 బంతుల్లో 11 ఫోర్లు,3 సిక్సర్లతో 105 నాటౌట్‌ ) అజేయ సెంచరీకి తోడు కెప్టెన్‌‌‌‌ స్టీవ్‌ స్మిత్‌ (32 బంతుల్లో 8 ఫోర్లతో 50) హాఫ్‌ సెంచరీ చేయడంతో రాజస్థాన్‌‌‌‌ రాయల్స్‌ 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 191 పరుగులు చేసింది.క్యాపిటల్స్‌ బౌలర్లలో రబాడ(2/37) రెండు వికెట్లుతీయగా, ఇషాంత్ శర్మ , క్రిస్‌ మోరిస్‌ , అక్షర్‌ పటేల్‌ తలో వికెట్‌ దక్కించుకున్నారు. అనంతరం పంత్‌ ,శిఖర్‌ ధవన్‌‌‌‌(27 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్సర్లతో 54)మెరుపులతో ఢిల్లీ క్యాపిటల్స్‌ 19.2 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి 193 పరుగులు చేసి గెలిచింది.పృథ్వీ షా( 39 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్సర్‌ తో 42)కూడా రాణించాడు.

అదిరే ఆరంభం

ఛేజింగ్‌ లో ఢిల్లీ క్యాపిటల్స్‌ కు అదిరిపోయే ఆరంభం దొరికింది. పృథ్వీ షా అండతో ఓపెనర్‌ శిఖర్‌ ధవన్‌‌‌‌ రాజస్థా న్‌‌‌‌ బౌలర్లపై ఎదురుదాడికి దిగడంతో స్కోరుబోర్డు పరుగులు పెట్టిం ది. పవర్‌ ప్లే ముగిసేరికి ఢిల్లీవికెట్‌ కోల్పోకుం డా 59 పరుగులు చేసింది. ఈసీజన్‌‌‌‌లో ఢిల్లీ ఓపెనర్లు నమోదు చేసిన తొలి హాఫ్‌సెంచరీ భాగస్వామ్యం ఇదే. ఈ క్రమంలో ధవన్‌‌‌‌ 25 బంతుల్లో హాఫ్‌ సెంచరీ పూర్తి చేశాడు. అయితే ధాటిగా ఆడుతున్న ధవన్‌‌‌‌ను ఔట్‌ చేసి శ్రేయస్‌ గోపాల్‌ రాజస్థాన్‌‌‌‌కు బ్రేక్‌ ఇచ్చా డు. గోపాల్‌ వేసిన ఇన్నింగ్స్‌ ఎనిమిదో ఓవర్‌ రెండో బంతికి బౌండరీ కొట్టిన ధవన్‌‌‌‌, తర్వా త బంతిని తప్పుగా అంచనా వేసి క్రీజు వదిలి ముందుకొచ్చా డు. వెంటనే శాంసన్‌‌‌‌ అతడిని స్టంపౌట్‌ చేశాడు.దీంతో 72 పరుగుల వద్ద ఢిల్లీ తొలి వికెట్‌ కోల్పోయింది. అయితే ఐదు పరుగుల తేడాతో కెప్టెన్‌‌‌‌ శ్రేయస్‌ అయ్యర్‌ (4) వికెట్‌ కోల్పోవడంతో ఢిల్లీ స్పీడు తగ్గింది.రియాన్‌‌‌‌ పరాగ్‌ వేసిన ఇన్నింగ్స్‌ 9వ ఓవర్‌ లో భారీషాట్‌ కొట్టిన అయ్యర్‌ డీప్‌ మిడ్‌ వికెట్‌ లో స్టోక్స్‌ కు దొరికిపోయాడు.కులకర్ణి వేసిన పవర్‌ ప్లే ఆఖరి ఓవర్‌ లోషా ఇచ్చిన క్యాచ్‌ ను టర్నర్‌ నేలపాలు చేశాడు. లైఫ్‌ సు సద్వి నియోగం చేసుకున్న పృథ్వీ . పంత్‌ తో కలిసిధాటిగా ఆడి జట్టును విజయం దిశగా నడిపించాడు.రాజస్థాన్‌‌‌‌ రాయల్స్‌ బౌలర్లపై పంత్‌ ఎదురుదాడికి దిగడంతో లక్ష్యం వేగంగా కరిగిపోయింది. అయితే 48 బంతుల్లో 84 పరుగులు జోడించిన పృథ్వీ – పంత్‌జట్టు విజయాన్ని ఖాయం చేశారు. పృథ్వీ షాను ఔట్‌చేసి గోపాల్‌ మరోసారి బ్రేక్‌ ఇచ్చాడు. 18వ ఓవర్‌ఆఖరి బంతికి రూథర్‌ ఫర్డ్‌‌‌‌(11)ను ఔట్‌ చేసిన కులకర్ణి ఢిల్లీ శిబిరంలో కాస్త ఆందోళన రేపినా.. భారీ సిక్సర్‌ తో పంత్‌ లాంఛనం పూర్తి చేశాడు.

రహానె హిట్‌‌‌‌.. మెరిసిన స్మిత్

ప్లేఆఫ్‌ రేసులో నిలవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌ లో టాస్‌ ఓడి ఫస్ట్‌‌‌‌ బ్యాటింగ్‌ కు దిగిన రాజస్థా న్‌‌‌‌కు రెండో ఓవర్‌లోనే షాక్‌ తగిలింది. ఓపెనర్‌ సంజు శాంసన్‌‌‌‌(0) కనీసం ఒక్క బంతి ఆడకుండానే రనౌటయ్యాడు. రబాడ బాల్‌ను డిఫెన్స్‌ ఆడిన రహానె పరుగు కోసం యత్నించి వెంటనే ఆగిపోయాడు.అప్పటికే హాఫ్‌ పిచ్ దాటిన శాంసన్‌‌‌‌ వెనక్కువెళ్లగా..రబాడ డైరెక్ట్‌‌‌‌ త్రోతో అతడిని రనౌట్‌ చేశాడు. అయితే ఇషాంత్‌ శర్మ వేసిన ఇన్నింగ్స్‌ తొలి ఓవర్లోనే బౌండ్రీతో ఖాతా తెరిచిన రహానె, వన్‌‌‌‌డౌన్‌‌‌‌లో వచ్చిన కెప్టెన్‌‌‌‌ స్మిత్‌ తో కలిసి రెచ్చి పోయాడు. వీరిద్దరూ ఎడాపెడా బౌండరీలు కొడుతూ ఢిల్లీ బౌలర్లపై ఒత్తిడి పెంచారు.అక్షర్‌ పటేల్‌ బౌలింగ్‌లో ఓ సిక్స్‌ , రబాడ బౌలింగ్‌ లోమరో సిక్స్‌ కొట్టిన రహానె.. మోరిస్‌ వేసిన ఎనిమిదో ఓవర్‌ లో ఫోర్‌ కొట్టి 32 బంతుల్లో హాఫ్‌ సెంచరీ పూర్తి చేశాడు. మరో ఎండ్‌లో స్మిత్‌ కూడా దూకుడు పెంచాడు. మిశ్రా వేసిన 11వ ఓవర్లో రెండు ఫోర్లు..రూథర్‌ ఫర్డ్‌‌‌‌  బౌలింగ్‌ లో హ్యాట్రిక్‌ ఫోర్లతో అలరించాడు. ఇదే జోరుతో 31 బంతుల్లోనే హాఫ్‌ సెంచరీ పూర్తిచేశాడు. 72 బంతుల్లో 130 పరుగులు జోడించి ప్రమాదకరంగా మారిన ఈ జోడీని అక్షర్‌ పటేల్ విడదీసి ఢిల్లీకి బ్రేక్‌ ఇచ్చా డు. హాఫ్‌ సెంచరీ చేసిన ఊపులో ఉన్న స్మిత్‌ .. అక్షర్‌ వేసిన లెంగ్త్‌‌‌‌ బాల్‌ కు భారీషాట్‌ కు ఆడి లాంగా ఫ్‌ లో మోరిస్‌ కు క్యాచ్‌ ఇచ్చా డు.దీంతో 13.1 ఓవర్ల వద్ద రాజస్థాన్‌‌‌‌ రెండో వికెట్‌ కోల్పోయింది. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన బెన్‌‌‌‌ స్టోక్స్‌(8) పరుగులు చేసేందుకు ఇబ్బంది పడ్డా.. రహానె జోరు కొనసాగించాడు. దీంతో15 ఓవర్లకే రాజస్థాన్‌‌‌‌ స్కోరు 150 దాటింది. మోరిస్‌ బౌలింగ్‌ లో స్టోక్స్‌ ఔటైనా..ఇషాంత్‌ బౌలింగ్‌ లో డబుల్‌ తీసిన 58 బంతుల్లో సెంచరీ పూర్తి చేశాడు. చివర్లో ఢిల్లీ బౌలర్లుపుంజుకున్నారు. సులువుగా 200 పరుగులు చేసేలాకనిపించిన రాయల్స్‌ వేగానికి కళ్లెం వేశారు.17వ ఓవర్‌ లో ఆసీస్‌ సంచలనం టర్నర్‌ (0) ఎదుర్కొన్నతొలి బంతికే ఔటయ్యాడు. సీజన్‌‌‌‌లో వరుసగా మూడోమ్యాచ్‌ లోనూ ఫస్ట్‌‌‌‌బాల్‌ కే డకౌటవడం గమనార్హం .ఆఖరి ఓవర్లో స్టువర్డ్‌‌‌‌ బిన్నీ (19), రియాన్‌‌‌‌ పరాగ్‌ (4)ను రబాడ ఔట్‌ చేశాడు.

స్కోర్‌ బోర్డు

రాజస్థాన్: రహానె (నాటౌట్‌ ) 105, శాం సన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ (రనౌట్‌ ) 0, స్మిత్‌ (సి) మోరిస్‌ (బి) అక్షర్‌ 50,స్టోక్ స్‌ (సి) అయ్యర్‌ (బి) మోరిస్‌ 8, టర్నర్‌ (సి)రూథర్‌ ఫర్డ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ (బి) ఇషాం త్‌ 0, బిన్నీ (బి) రబాడ19, పరాగ్‌ (బి) రబాడ 4 ; ఎక్స్‌ ట్రాలు: 5;మొత్తం : 20 ఓవర్లలో 191/6

ఢిల్లీ క్యాపిటల్స్ : పృథీ షా(సి) పరాగ్ (బి)గోపాల్‌ 42, ధవన్‌‌‌‌ (స్టంప్డ్‌‌‌‌) శాంసన్‌‌‌‌ (బి)గోపాల్‌ 54, అయ్యర్ (సి) స్టోక్స్‌ (బి) పరాగ్‌ 4,పంత్‌ (నాటౌట్)78, రూథర్‌ ఫర్డ్‌‌‌‌ (సి) పరాగ్​ (బి) కులకర్ణి 11, ఇంగ్రామ్​(నాటౌట్)3,ఎక్స్‌ ట్రాలు:1 ;మొత్తం : 19.2 ఓవర్లలో 193/4

 

Latest Updates