శ్రేయస్ కు రూ. 12 లక్షల ఫైన్

అబుదాబి: స్లో ఓవర్‌ రేట్‌ కారణంగా ఢిల్లీ క్యాపిటల్స్‌ కెప్టెన్‌ శ్రేయస్‌ అయ్యర్‌కు రూ. 12 లక్షల జరిమానా విధించారు. సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో నిర్దిష్ట టైమ్‌లో వేయాల్సిన ఓవర్ల కంటే తక్కువగా వేయడంతో నిర్వాహకులు ఈ చర్య తీసుకున్నారు. ఈ సీజన్‌లో ఇదే మొదటి తప్పు కావడంతో కేవలం ఫైన్‌తో సరిపెట్టారు. ‘ఢిల్లీ క్యాపిటల్స్‌ టీమ్‌ స్లో ఓవర్‌ రేట్‌ను మెయింటేన్‌ చేసింది. దీంతో కెప్టెన్‌పై జరిమానా విధించాం. ఇలాంటి తప్పు పునరావృతం కాకూడదు. ఒకవేళ జరిగితే ఐపీఎల్‌ కోడ్‌ ఆఫ్‌ కండక్ట్‌ ప్రకారం చర్యలు తీవ్రంగా ఉంటాయి’ అని ఐపీఎల్‌ ప్రకటనను విడుదల చేసింది.

Latest Updates