ముంబైతో ఎవరు? : ఫైనల్ బెర్త్ కోసం నేడు చెన్నై, ఢిల్లీ ఢీ

విశాఖపట్నం : తుది అంకానికి చేరుకున్న ఐపీఎల్‌ పన్నెండో సీజన్‌ లో మరో రసవత్తర పోరుకు రంగం సిద్ధమైంది. లీగ్‌ లో అత్యంత విజయవంతమైన చెన్నై సూపర్‌ కింగ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, గత సీజన్లకు భిన్నంగా అద్భుతంగా ఆడుతున్న ఢిల్లీ క్యాపిటల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఫైనల్‌ బెర్త్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కోసం సాగర తీరంలో శుక్రవారం అమీతుమీ తేల్చుకోనున్నా యి. ముంబై చేతిలో చిత్తయి డీలా పడ్డ చెన్నై వెంటనే పుంజుకొని ఈ సెకండ్‌ చాన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను సద్వి నియోగం చేసుకోవాలని చూస్తుంది. సన్‌ రైజర్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై ఉత్కంఠ విజయం సాధించిన క్యాపిటల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అదే ఉత్సాహాన్ని ధోనీసేనపై కొనసాగించాలని భావిస్తోంది. దాంతో, ఈ మ్యాచ్‌ లో హోరాహోరీ తప్పదనిపిస్తోంది.

చతికిల పడ్డా .. చెన్నై చెన్నైయే..

ఐపీఎల్‌ లో అత్యంత విజయవంతమైన జట్టంటే మరో మాట లేకుండా చెన్నై అనేస్తాం. సస్పెన్ష న్‌ కు గురైన రెండేళ్లను మినహా పది సీజన్లలో చెన్నై ప్రతీసారి ప్లేఆఫ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు చేరుకుంది. ఏడు ఫైనల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో పోటీ పడింది. అంచనాలకు తగ్గ ట్టే హ్యా ట్రిక్‌ విజయాలతో ఈసారి లీగ్‌ ను షురూ చేసిన ధోనీసేన తర్వాత వరుసగా నాలుగు విజయాలతో అందరికంటే ముందే ప్లే ఆఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బెర్త్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ను  ఖాయం చేసుకుంది. కానీ, చివరి దశలో మాత్రం చెన్నై పడుతూ లేస్తూ వస్తోంది. చివరి ఆరు లీగ్‌ మ్యాచ్‌ ల్లో నాలుగింట్లో ఓడిపోయి టాప్‌ ప్లేస్‌ ను ముంబైకి ఇచ్చుకుంది. హోమ్‌ గ్రౌండ్‌ లో తొలి క్వా లిఫయర్‌ లో అయితే దారుణంగా ఆడింది. టీమ్‌ సెలెక్షన్‌ నుంచి షాట్‌ సెలెక్షన్‌ వరకూ అన్నింటా విఫలమైంది. ఈ సారి ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్నా మూల్యం చెల్లించుకోక తప్పదని ఆ జట్టు గుర్తించాలి. అయితే, సుదీర్ఘ అనుభవం ఉన్న మహీని, సూపర్‌ కింగ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను తక్కు వగా అంచనా వేయడానికి వీళ్లేదు. నాకౌట్‌ మ్యాచ్‌ ల్లో చెలరేగి ఆడే చెన్నై తనదైన శైలిలో పుంజుకోవాలని భావిస్తోంది. బ్యాట్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెన్‌ నుంచి ధోనీ మంచి పెర్ ఫామెన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆశిస్తున్నాడు. షాట్‌ సెలెక్షన్‌ విషయంలో జాగ్రత్తగా ఉండాలని సహచరులను హెచ్చరిస్తున్నాడు.

ఓపెనర్‌ షేన్‌ వాట్సన్‌ వైఫల్యం జట్టుపై ప్రభావం పడుతోంది. సన్‌ రైజర్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై 53 బంతుల్లో 96 పరుగుల ఇన్సింగ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ తర్వా త వాట్సన్‌ రాణించిన దాఖలాలు లేవు. అయినా తనపై భరోసా ఉంచిన కెప్టెన్‌ నమ్మకానికి ఆసీస్‌ వెటరన్‌ న్యాయం చేయాల్సిన సమయమిది. డుప్లెసిస్‌, రైనా కూడా బాధ్యత తీసుకోవాల్సి ఉంటుంది. గత మ్యాచ్‌ లో రాయుడు తీవ్ర ఒత్తిడి లో విలువైన పరుగులు చేసి ఫామ్‌ లోకి రావడం ఊరటనిచ్చే అంశం. బౌలింగ్‌ లో చెన్నైకి వంకపెట్టాల్సిన అవసరం లేదు. తాహిర్‌ , హర్భజన్‌ , రవీంద్ర జడేజా త్రయం అద్భుతంగా బౌలింగ్‌ చేస్తున్నారు. యువ పేసర్‌ దీపక్‌ చహర్‌, ఆల్‌ రౌండర్‌ డ్వేన్‌ బ్రావోతో పేస్‌ కూడా బలంగానే ఉంది. కానీ, ఆరో బౌలర్‌ ఆప్షన్‌ లేకపోవడం కొన్ని సార్లు చెన్నైని దెబ్బ తీస్తుంది. ధోనీ ఎక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ట్రా బౌలర్‌ తో బరిలోకి దిగుతాడేమో చూడాలి.

సమరోత్సాహంలో ఢిల్లీ

ఈ సీజన్‌ లో పేరు, జెర్సీ తో పాటు పలువురు ఆటగాళ్లను మార్ చుకొని బరిలోకి దిగిన ఢిల్లీ క్యాపిటల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై ఎవ్వరికీ పెద్దగా అంచనాలు లేవు. కానీ, కుర్రాళ్ల దూకుడుకు గంగూలీ, పాంటింగ్‌ మార్గనిర్దేశం తోడవడంతో ఢిల్లీ ఓ రేంజ్‌ లో విజృంభించింది. జూనియర్లు, సీనియర్లు సమష్టిగా ఆడడంతో నిలకడగా విజయాలు సాధించిన ఢిల్లీ టైటిల్‌ రేసులో నిలిచింది. రిషబ్‌ పంత్‌ , పృథ్వీషా, శ్రేయస్‌ అయ్యర్‌, ధవన్‌ బ్యాటింగ్‌ బాధ్యత తీసుకున్నారు. బౌలింగ్‌ లో రబాడ, అమిత్‌ మిశ్రా, ఇషాంత్‌ సత్తా చాటారు. టాప్‌ వికెట్‌ టేకర్‌ రబాడ గాయంతో చివరి దశకు దూరమైనా గత మ్యాచ్‌ లో ఆ లోటు కనిపించలేదు. అయితే, అన్నీ తమవైపే ఉన్నా అనవసరంగా ఒత్తిడికి గురవడం ఢిల్లీ బ్యాడ్‌ హాబిట్‌ . ఎలిమినేటర్‌ లోనూ ఈజీగా గెలుస్తుందనుకుం టే మధ్యలో.. చివర్లో వికెట్లు కోల్పోయి కంగారు పడింది.

అయితే, రిషబ్‌ పంత్‌ ధనాధన్‌ బ్యాటింగ్‌ తో చెలరేగడం క్యాపిటల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ శిబిరంలో ఉత్సాహం నింపే అంశం. ఫినిషర్‌ గా తన సామర్థ్యంపై వస్తున్న విమర్శలకు పంత్‌ మరోసారి బ్యాట్‌ తోనే సమాధానం చెప్పాడు. మరో యంగ్‌ స్టర్‌ పృథ్వీ కూడా ఫామ్‌ లోకి రావడంతో ఢిల్లీ బ్యాటింగ్‌ బలం పెరిగింది. అయితే, మిడిలార్డర్‌ లో పంత్‌ తప్ప బాధ్యత తీసుకునే వారు లేకపోవడం ఢిల్లీకి మైనస్‌. రూథర్‌ ఫర్డ్‌ , కీమో పాల్‌ రాణిస్తు న్న ఆల్‌ రౌండర్‌ అక్షర్‌ పటేల్‌ ఆకట్టు కోవడం లేదు. పైగా స్పిన్‌ బౌలింగ్‌ లో ఢిల్లీ బ్యాట్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెన్‌ తడబడుతున్నారు. గత మ్యాచ్‌ లో రషీద్‌ ఖాన్‌, నబీ బౌలింగ్‌ లో ఇబ్బంది పడ్డారు. మరి, చెనై స్పిన్‌ త్రయాన్ని వాళ్లు ఎలా ఎదుర్కొం టారో చూడాలి.

Latest Updates