హైదరాబాద్ తో కీలక మ్యాచ్.. టాస్‌ గెలిచిన ఢిల్లీ

దుబాయ్:  ఐపీఎల్‌-సీజన్- 13లో భాగంగా మంగళవారం హైదరాబాద్ తో జరుగుతున్న కీలక మ్యాచ్ లో టాస్ గెలిచింది ఢిల్లీ. ఈ రసవత్తర పోరులో టాస్‌ గెలిచిన ఢిల్లీ కెప్టెన్‌ శ్రేయస్‌ అయ్యర్‌ బౌలింగ్‌ ఎంచుకున్నాడు. లీగ్‌ దశను టాప్‌-2తో  ముగించాలనుకుంటున్నట్లు అయ్యర్‌ చెప్పాడు.

తొడ కండరాల గాయంతో గత కొన్ని మ్యాచ్‌లకు దూరమైన కేన్‌ విలియమ్సన్‌ మళ్లీ తుది జట్టులోకి వచ్చాడు. బెయిర్‌ స్టో,      ప్రియం గార్గ్‌, ఖలీల్‌ అహ్మద్‌ స్థానంలో విలియమ్సన్, వృద్ధిమాన్‌ సాహా, షాబాద్‌ నదీంలను జట్టులోకి తీసుకున్నట్లు తెలిపాడు హైదరాబాద్‌ కెప్టెన్ డేవిడ్ వార్నర్‌. ప్లేఆఫ్ రేసులో నిలవాలంటే ఈ మ్యాచ్ తప్పక గెలవాల్సిన మ్యాచ్ కోసం సన్ రైజర్స్ హైదరాబాద్ కీలక మార్పులు చేసింది. ఆల్ ద బెస్ట్ హైదరాబాద్.

టీమ్స్

 

Latest Updates