సిక్సర్లతో విరుచుకుపడ్డ గేల్..ఢిల్లీ టార్గెట్ 164

ఢిల్లీ : ఢిల్లీ క్యాపిటల్స్ తో జరుగుతున్న మ్యాచ్ లో పంజాబ్ ను  తక్కువ స్కోరుకే పరిమితం చేశారు బౌలర్లు. 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయిన పంజాబ్ 163 పరుగులు చేసి ఢిల్లీకి 164 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశింది. ఢిల్లీ బౌలర్లలో సందీప్ లమిచ్చనే మూడు వికెట్లు తీయడంతో పంజాబ్ స్కోరు వేగం తగ్గింది.  రబాడ,అక్షర్ పటేల్ కు తలో రెండు వికెట్లు పడ్డాయి.

టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన పంజాబ్ కి ఒపెనరలో లోకేష్ రాహుల్ 12 పరుగులకే ఔటయినా.. మరో ఓపెనర్  గేల్ సిక్సర్లతో విరుచుకుపడ్డాడు. నిలబడి అలవోకగా సిక్సర్లు ,ఫోర్లు బాదాడు.37 బంతుల్లో 6 ఫోర్లు, 5 సిక్సర్లతో చెలరేగిన గేల్ 69 పరుగులు చేశాడు. మనదీప్ సింగ్30 పరుగులు మినహా మిగతా బ్యాట్స్ మెన్ ఎవరూ అంతగా రాణించకపోవడంతో పంజాబ్ 163 పరుగులు మాత్రమే చేయగల్గింది.

 

 

 

Latest Updates