దంచికొట్టిన ఢిల్లీ : ధావన్, అయ్యర్ హాఫ్ సెంచరీలు

ఢిల్లీ : బెంగళూరుతో జరుగుతున్న మ్యాచ్ లో ఢిల్లీ ఇన్నింగ్స్ ముగిసింది. టాసె గెలిచి ఫస్ట్ బ్యాటింగ్ చేసిన శ్రేయాస్ అయ్యర్ సేన నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 187 రన్స్ చేసింది. కెప్టెన్ శ్రేయాస్ అయ్యార్ (52), ఓపెనర్ శిఖర్ ధావన్(50) హాఫ్ సెంచరీలతో రాణించారు. రిషబ్ పంత్(7) మరోసారి నిరాశపరిచాడు. చివర్లో వచ్చిన రుథర్ ఫోర్డ్, అక్షర్ పటేల్ బౌండరీలు రాబట్టడంతో ఢిల్లీకి గౌరవప్రధమైన స్కోర్ దక్కింది.

ఢిల్లీ ప్లేయర్లలో పృద్వీషా(18), ధావన్(50), శ్రేయాస్(52), రిషబ్ పంత్(7), కొలిన్ ఇన్ గ్రామ్(11), రుథర్ ఫోర్డ్(28), అక్షర్ పటేల్(16) రన్స్ చేశారు.

బెంగళూరు బౌలర్లలో..చాహల్(2), ఉమేష్ యాద్(1), వాషింగ్టన్ సుందర్(1), సైనీ(1) వికెట్లు తీశారు.

Latest Updates