ఢిల్లీ పిల్లలు రోజూ10 సిగరెట్ల పొగ పీల్చేస్తున్నరట..!

‘పొగ తాగడం ఆరోగ్యానికి హానికరం’… కానీ ఢిల్లీ పిల్లలు రోజూ10 సిగరెట్ల పొగ పీల్చేస్తున్నరట! అయ్యో.. చిన్న వయసులోనే స్మోకింగ్ కు అలవాటు పడిపోతున్నారా? అని సర్ ప్రైజ్ కావద్దు. వాళ్లు పీలుస్తున్నది సిగరెట్ పొగ కాదు.. పొల్యూషన్ పొగ! ఢిల్లీలో విషపూరితం అయిపోయిన గాలి! ఆ పొగ, గాలి ఎఫెక్ట్ నెలరోజుల్లో దాదాపు340 సిగరెట్లు తాగినంత తీవ్రంగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. గత నెల 20వ తేదీ నుంచి ఈ నెల 21 మధ్య ఢిల్లీలో ఎయిర్ పొల్యూషన్ తీవ్రస్థాయికి చేరింది. దీంతో ఢిల్లీలోని గాలిలో మనుషుల ఊపిరితిత్తులకు హాని చేసే పీఎం2.5 కాలుష్య కారకాలు, వాటి ఎఫెక్ట్ ను అంచనా వేశారు. పీఎం 2.5 సైజ్ కణాలు ఒక క్యూబిక్ మీటర్ గాలిలో 22 మైక్రోగ్రాములు ఉంటే.. ఒక రోజుకు ఒక సిగరెట్ తాగినట్లు లెక్క అని అప్పట్లో కాలిఫోర్నియాలోని బర్కిలీ ఎర్త్ రీసెర్చర్లు అంచనా వేశారు. అక్టోబర్ 20, నవంబర్ 21 మధ్య ఢిల్లీలోని అన్ని వెదర్ మానిటరింగ్ కేంద్రాల్లో పీఎం 2.5 కణాలు సగటున ఒక క్యూబిక్ మీటర్ గాలిలో 227 మైక్రోగ్రాములు ఉన్నట్లు తేలింది. అంటే.. ఈ గాలిని పీల్చితే.. రోజూ 10 సిగరెట్లు తాగినంత ఎఫెక్ట్ పడుతుందని నిపుణులు అంచనా వేశారు. నవంబర్ 3న గాలి మరీ విషపూరితం అయిందని, ఆ రోజంతా ఢిల్లీ గాలి పీల్చినోళ్లు.. 26 సిగరెట్లు తాగినట్లేనని గుర్తించారు. మొత్తంగా ఎయిర్ పొల్యూషన్ వల్ల ఢిల్లీలో ఉండేటోళ్ల ఆయుష్షు 17 ఏండ్లు తగ్గుతుందట. ఢిల్లీ, ఎన్ సీఆర్ ప్రాంతంలో ఎయిర్ పొల్యూషన్ వల్ల శ్వాస సంబంధమైన సమస్యలే కాకుండా, చర్మ రోగాల ముప్పు  కూడా పెరుగుతోందని ఎయిమ్స్​  డాక్టర్లు చెబుతున్నారు. ప్రస్తుతం పొల్యూషన్ వల్ల ఢిల్లీలో చర్మ సమస్యలు 30 శాతం పెరిగాయని వివరించారు.

 

Latest Updates