మృతుల కుటుంబాలకు రూ.10 లక్షల పరిహారం

న్యూ ఢిల్లీ:  దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన ఘోర అగ్నిప్రమాదంలో మృతుల సంఖ్య 43 కు చేరుకుంది.  ఆదివారం అనాజ్ మండిలోని ఓ ఫ్యాక్టరీలో జరిగిందీ ఘటన.  ప్రమాదం గురించి తెలుసుకొన్న ఆ రాష్ట్ర సీఎం అరవింద్ కేజ్రీవాల్  సంఘటనా స్థలాన్ని సందర్శించి,  ప్రమాదం జరిగిన తీరును అడిగి తెలుసుకున్నారు.

ఆ తర్వాత కేజ్రీవాల్ మీడియాతో మాట్లాడుతూ..  అగ్నిప్రమాదం చాలా విషాదకరమని, ఈ ఘటనపై న్యాయ విచారణకు ఆదేశిస్తున్నామన్నారు. ప్రమాదంలో మృతుల కుటుంబాలకు రూ.10లక్షల పరిహారం అందిస్తామని హామీ ఇచ్చారు. గాయపడ్డ వారికి రూ.లక్ష పరిహారం ఇస్తామన్నారు.

ఈ విషాద సంఘటనపై ప్రధాని నరేంద్ర మోడీ, హోంమంత్రి అమిత్ షా, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ లు కూడా ఆవేదన వ్యక్తం చేశారు. ప్రధాని మోడీ మృతి చెందిన వారి కుటుంబాలకు రూ .2 లక్షల ఎక్స్-గ్రేషియాను ప్రకటించారు.  తీవ్రంగా గాయపడిన వారికి రూ.50,000 ఆర్ధిక సాయం అందించేందుకు ఆమోదించారు. ఆదివారం తెల్లవారుజామున ఈ ప్రమాదం జరిగింది. ఫ్యాక్టరీ నుంచి భారీ ఎత్తున మంటలు రావడం గమనించిన స్థానికులు, అగ్ని మాపక సిబ్బంది..  62 మందిని కాపాడారు. 43  మంది అక్కడే సజీవ దహనమయ్యారు. గాయపడిన వారిని లోక్ నాయక్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

Delhi CM Arvind Kejriwal announces Rs 10 lakh for families of Anaj Mandi fire victims

Latest Updates