క్రేజీ ఆఫర్.. ఢిల్లీలో పెండింగ్ వాటర్ బిల్లులు మాఫీ

delhi-cm-kejriwal-announces-one-more-assurance-to-people

ఎన్నికల వేళ ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ మరో ఆఫర్ ప్రకటించారు. పెండింగ్ వాటర్ బిల్లులను మాఫీ చేశారు. అయితే నీటి మీటర్లను నవంబర్ 30 వరకు బిగించుకున్న వారికే ఈ ఆఫర్ వర్తిస్తుందని తెలిపారు. ప్రజలంతా వాటర్ మీటర్లను ఏర్పాటు చేసుకుని ప్రభుత్వానికి సహకరించాలని కేజ్రీవాల్ పిలుపిచ్చారు.

త్వరలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికలకు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్.. వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. 200 యూనిట్లలోపు వాడుకునే ఇళ్లకు ఉచిత కరెంట్, మెట్రో రైలులో ఆడవాళ్లకు ఉచిత ప్రయాణం, 400 యూనిట్లలోపు ఎలక్ట్రిసిటీ వాడితే 50 శాతం సబ్సిడీ, సిటీ అంతటా సీసీటీవీ కెమెరాలు,  ఫ్రీ వై – ఫై లాంటి ఆఫర్లు ఇప్పటికే ప్రకటించారు కేజ్రీవాల్.

Latest Updates