తనిఖీల్లో కారుపై ఎక్కిన ట్రాఫిక్ పోలీస్..ఆగకుండా 2 కి.మీ తీసుకెళ్లిన డ్రైవర్

తనిఖీ చేయడానికి వచ్చిన ట్రాఫిక్ పోలీసుకు ముచ్చెమటలు పట్టించాడు ఓ కారు డ్రైవర్. కారుపై ఎక్కిన ట్రాఫిక్  పోలీసును రెండు కిలోమీటర్లు ఆగకుండా తీసుకెళ్లాడు. 2019 నవంబర్ లో ఢిల్లీలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో లేటెస్ట్ గా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

గతేడాది నవంబర్ లో ఢిల్లీలోని  నాంగ్లోయి చౌక్ వద్ద వాహనాల పేపర్లను తనిఖీ చేస్తుండగా, ఒక వ్యక్తి కారు మరొక వైపు నుండి వచ్చింది. పోలీసులు ఆ వ్యక్తిని ఆపమని కోరారు. ఆపినట్టు నమ్మించిన ఆ  కారు డ్రైవర్ పారిపోవడానికి ప్రయత్నించాడు. దీంతో సునీల్ అనే ట్రాఫిక్ పోలీస్ వాళ్లను పట్టుకోవడానికి ఆ కారు బొనెట్ పైకి దూకాడు. అయినా  ఆగకుండా కారును దాదాపు రెండు కిలోమీటర్ల దూరం తీసుకెళ్లాడు డ్రైవర్. తర్వాత  ట్రాఫిక్ పోలీసు బతిమాలాడంతో   స్పీడ్  తగ్గించడంతో  అపుడు ట్రాఫిక్ పోలీస్ కారు దిగాడు. తర్వాత వాళ్లు అక్కడి నుంచి పారిపోయారు. ఈ ఘటనను కారులో ఉన్న మరో వ్యక్తి వీడియో తీశాడు. ఈ ఘటనలో ట్రాఫిక్ పోలీసుకు గాయాలయ్యాయి. తర్వాత ఉన్నతాధికారులు దీనిపై విచారణకు ఆదేశించారు.

see more news

దారుణం..మహిళా టీచర్ కాళ్లు చేతులు కట్టేసి రోడ్డుపై ఈడ్చుకెళ్లి..

వరల్డ్ రికార్డ్ బద్దలు కొట్టిన బుమ్రా

సంజూ శాంసన్ సూపర్ మ్యాన్ క్యాచ్..మ్యాచ్ కే హైలెట్

Latest Updates