మాల్యాకు ఢిల్లీ కోర్టు షాక్‌

లిక్కర్ కింగ్ విజయ్ మాల్యాకు సంబంధించి బెంగళూరులో ఉన్న ఆస్తులను స్వాధీనం చేసుకోవాలని ఢిల్లీలోని కోర్టు శనివారం ఆ రాష్ట్ర పోలీసులను ఆదేశించింది. మాల్యాను ఇప్పటికే ప్రకటిత నేరగాడిగా కోర్టు తులిపింది. ఫెరా చట్టాన్ని ఉల్లంఘించిన కేసుకు సంబంధించి ఈ ఆదేశాలను ఇచ్చింది. ఢిల్లీ చీఫ్‌ మెట్రోపొలిటిన్‌ మెజిస్ట్రేట్‌ దీపక్‌ షెరావత్‌ ఈ ఉత్తర్వులను జారీ చేశారు. ఇందుకు జూలై 10 వరకు గడువు విధించింది. ఇప్పటికే బెంగళూరు పోలీసులు దాదాపు 159 ఆస్తులను గుర్తించినట్లు కోర్టుకి తెలియజేశారు. ఫెరా చట్టం కింద జారీ చేసిన సమన్లకు స్పందించకపోవడంతో కోర్టు ఈ నిర్ణయం తీసుకొంది. ఇప్పటికే మాల్యాపై నాన్‌బెయిలబుల్‌ వారెంట్‌ పెండింగ్‌లో ఉంది. రూ.9వేల కోట్ల రూపాయల మేర బ్యాంకులను మోసం చేయడంతో పాటు, మనీలాండరింగ్‌కు పాల్పడ్డారని విజయ్ మాల్యాపై ఆరోపణలు ఉన్నాయి. రుణ బకాయిలను వసూలు చేసుకునుందుకు  SBI  నేతృత్వంలో బ్యాంకుల కన్సార్షియం న్యాయపరమైన చర్యలు ప్రారంభించడంతో 2016లో విజయ్ మాల్యా భారత్‌ నుంచి పారిపోయి బ్రిటన్‌లో తలదాచుకున్నారు. ఆయన్ను భారత్‌ రప్పించేందుకు CBI, ED తీవ్ర ప్రయత్నాలు చేశాయి.

Latest Updates