ఆప్ అభ్యర్థులను ప్రకటించిన కేజ్రీవాల్

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ తరపున పోటీ చేసే అభ్యర్థుల లిస్ట్ ను విడుదల చేశారు  ఆ పార్టీ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్. నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైన తొలిరోజే లిస్ట్ ను విడుదల చేయడం గమనార్హం. 70 అసెంబ్లీ స్థానాల్లో 46మంది సిట్టింగ్ లకే అవకాశం ఇచ్చారు. 15స్థానాల్లో   కొత్తవారిని ఎంపిక చేశారు. ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా పట్పర్ గంజ్ అసెంబ్లీ స్థానం నుంచి పోటీచేయనున్నారు. పోలింగ్ కు మరో 25రోజుల సమయం మాత్రమే ఉండడంతో అన్ని పార్టీలు ఎలక్షన్ కు రెడీ అవుతున్నాయి. ఫిబ్రవరి 8న ఎన్నికలు జరుగనుండగా… 11న రిజల్ట్ వెలువడనున్నాయి.

 

Latest Updates