ఢిల్లీ ఎన్నికల కౌంటింగ్ షురూ..

శనివారం, ఫిబ్రవరి 8న ఢిల్లీలోని 70 అసెంబ్లీ సీట్లకు ఎన్నికలు జరిగాయి. వాటి ఫలితాలు ఈ రోజు రానున్నాయి. ఈ ఎన్నికలు ముఖ్యంగా బీజేపీ, ఆప్‌ల మధ్యే కొనసాగుతున్నాయి. ఎన్నికల కౌంటింగ్ కోసం ఎన్నికల అధికారులు 21 కౌంటింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. 70 సీట్లలో 58 సీట్లు జనరల్ అభ్యర్థులకు, 12 సీట్లు రిజర్వ్డడ్ సీట్లకు కేటాయించారు. ఈ ఎన్నికలలో మొత్తం 70 సీట్లకు గాను 672 మంది పోటీలో ఉన్నారు. న్యూఢిల్లీ సీటు కోసం అత్యధికంగా 26 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. పటేల్ నగర్ స్థానం నుంచి అత్యల్పంగా నలుగురు మాత్రమే పోటీలో ఉన్నారు.

బీజేపీ రెండు దశాబ్ధాల నిరీక్షణ ఫలిస్తుందో లేదో తేలిపోతుంది. ఎగ్జిట్ పోల్స్ మాత్రం ఆప్‌కే పట్టం కట్టాయి. దాంతో ముచ్చటగా మూడోసారి కేజ్రీవాల్ సీఎం అవుతారని ఆప్ కార్యకర్తలు సంబరాలు చేసుకుంటున్నారు. మధ్యాహ్నం 12 గంటల వరకు పూర్తి స్థాయిలో మెజారిటీ ఎవరిదో తేలిపోతుంది. కౌంటింగ్ కేంద్రాల వద్ద పోలీసులు గట్టి భద్రతా ఏర్పాట్లు చేశారు.

Latest Updates