ఢిల్లీ ఎగ్జిట్ పోల్స్ : అధికారం ఆమ్ఆద్మీ దే

దేశం మొత్తం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఢిల్లీ ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు విడుదలయ్యాయి. 70 అసెంబ్లీ నియోజకవర్గాల్లో  మొత్తం 672 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. అధికార పార్టీ ఆమ్ ఆద్మీ, బీజేపీ, కాంగ్రెస్ మధ్య పోటీనెలకొంది.

అయితే విడుదలైన  టైమ్స్ నౌ-ఐపిఎస్ఓఎస్ ఎగ్జిట్ పోల్ ప్రకారం  అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ 47 సీట్లు గెలుచుకుంటుందని, బీజేపీ 23 సీట్లు సాధింస్తుందని అంచనా. అయితే, ఎగ్జిట్ పోల్ తన ఖాతాను తెరవడంలో కాంగ్రెస్ మరోసారి విఫలమవుతుందని ఎగ్జిట్ పోల్స్ లో తేలింది.

ఢిల్లీ ఎన్నికల ఎగ్జిట్ పోల్ కి కొద్ది నిమిషాల ముందు అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ 50 సీట్లు గెలుచుకుంటుందని బీజేపీ ఎంపీ పర్వేష్ వర్మ అభిప్రాయం వ్యక్తం చేశారు. ఫలితం మాత్రం ఫిబ్రవరి 11 న విడుదలవుతుందన్న ఆయన  ఆమ్ ఆద్మీ పార్టీ  16 సీట్లు, కాంగ్రెస్ నాలుగు స్థానాలు దక్కించుకుంటాయన్నారు.

                       ఢిల్లీ ఎగ్జిట్ పోల్స్

ఆప్ బీజేపీ కాంగ్రెస్
టైమ్స్ నౌ 47 23 0
జాన్ కి బాత్ 55 15 0
ఇండియా న్యూస్ నేషన్ 55 14 1
టీవీ9 భారత వర్ష 54 15 1
సుదర్శన్ న్యూస్ 43 26 1
పోల్ ఆఫ్ ఫోల్స్ 51 18 1

 

Latest Updates